Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సామ్‌, చై విడాకులపై వెంకటేష్‌ రియాక్షన్‌

హైదరాబాద్‌ : సమంత-నాగ చైతన్య విడాకులపై తాజాగా విక్టరీ వెంకటేష్‌ సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్‌ అయ్యారు. కొన్ని రోజులుగా సామ్‌, చై విడిపోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈనెల 2న ఇద్దరు తమ తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా తాము విడిపోతున్నా మని అఫీషియల్‌గా కన్‌ఫమ్‌ చేశారు. అయితే వీరు కన్‌ఫర్మేషన్‌ ఇవ్వకముందు వరకు ఒకరకమైన కామెంట్స్‌, వార్తలు వస్తే విడిపోతున్నామని కన్‌ఫర్మేషన్‌ ఇచ్చాక మరో రకమైన కామెంట్స్‌.. సోషల్‌ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు రాసేస్తున్నారు. దీనిపై తాజాగా నాగ చైతన్య మేనమామ, సీనియర్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ దగ్గుబాటి రియాక్ట్‌ అవుతూ తన ఇన్‌స్టాగ్రాం స్టాటస్‌లో దిమ్మతిరిగిపోయే కామెంట్‌ పెట్టారు.‘నోరు తెరిచే ముందు మనసు తెరవండి’ అని అర్థం వచ్చే ఇంగ్లీష్‌లో ఓ కామెంట్‌ పెట్టి తప్పుగా మాట్లాడుతున్నవారికి సెటైరికల్‌గా కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం వెంకీ చేసిన కామెంట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img