Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సూర్యతో లోకేశ్‌ సినిమా


చెన్నై: ‘రోలెక్స్‌’ ఇండస్ట్రీని షేక్‌ చేసిన ఓ పాత్ర పేరు ఇది. కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’లో సూర్య పోషించిన ఈ పాత్రకు సినీ ప్రియులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇదే విషయంపై తాజాగా కమల్‌ హాసన్‌ మాట్లాడారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌హాసన్‌, ఓ విభాగంలో సూర్యకు అవార్డు అందించారు. ‘రోలెక్స్‌ పాత్ర.. మా సినిమా మరెంతో మందికి చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినం దుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. ఇది మేము చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్‌ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నాడు’’ అంటూ సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్‌ ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘విక్రమ్‌-రోలెక్స్‌ను ఒకే స్టేజ్‌పై చూడటం ఆనందంగా ఉంది’ అంటూ నెటిజన్లు అంటున్నారు. సూర్యతో సినిమా చేయడంపై ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేశ్‌ క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే సూర్యతో ఓ సినిమా చేస్తానని అన్నారు. ‘‘సూర్యతో ప్రాజెక్ట్‌ చేయాలని నాక్కూడా ఆసక్తిగా ఉంది. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. 150 రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తా’’ అని ఆయన వెల్లడిరచారు. ఈ వ్యాఖ్యలపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, లోకేశ్‌ ప్రస్తుతం విజయ్‌తో ‘లియో’ చేస్తోన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img