Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హాలీవుడ్‌పై కన్నేసిన రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: హాలీవుడ్‌ ఇండస్ట్రీపై టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ సినిమాలను కూడా అంతే గొప్పగా స్వీకరించే హృదయం హాలీవుడ్‌ కు ఉందని ఆయన చెప్పారు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏబీసీ న్యూస్‌ తరపున చరణ్‌ను విల్‌ రీవ్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనుందని కూడా రామ్‌చరణ్‌ వెల్లడిరచాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం తాము ఎంతో కష్టపడ్డామని చరణ్‌ చెప్పారు. నాటునాటు పాటను ఉక్రెయిన్‌ లోని అందమైన లొకేషన్లలో తీశామని, షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక టూరిస్ట్‌ గా మళ్లీ ఉక్రెయిన్‌ కు వెళ్లాలని అనుకున్నానని, నాటునాటు పాటకు ఆస్కార్‌ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడతానన్నాడు. ఆస్కార్‌ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తుండటం సంతోషకరమని తెలిపాడు. సినిమాకు భాష ఉండదని, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని… సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, డ్యాన్స్‌ చేయిస్తుంది, భయపెడుతుంది, ఇలా అన్నీ చేయిస్తుందని తమ దర్శకుడు రాజమౌళి చెపుతుంటారని పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా చూశారని చెప్పాడు. తాను ఇండియాకు వెలుపల కూడా సినిమాలు చేయాలనుకుంటున్నానని, హాలీవుడ్‌ సినిమాలు చేయాలనే కోరిక కూడా ఉందని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img