Friday, April 19, 2024
Friday, April 19, 2024

హేమ చెప్పినవి అవాస్తవాలు..

: జీవితా రాజశేఖర్‌
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)పై సినీ నటి హేమ చేసిన ఆరోపణల్ని ‘మా’ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ ఖండిరచారు. మా’ అసోసియేషన్‌ డబ్బుని మొత్తం వాడేస్తున్నారంటూ హేమ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా వీటికి కౌంటర్‌ ఇస్తూ సోమవారం నరేష్‌తో కలిసి జీవిత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హేమ మాట్లాడినవన్నీ అవాస్తవాలని అని అన్నారు. ‘ఏ ఉద్దేశంతో మీడియా ముందుకు వెళ్లి.. తప్పుడు ఆరోపణలు చేశారు. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటిస్తామని జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న తరువాత ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.’ అని అన్నారు. ‘ప్రస్తుతం ‘మా’ నిల్వ రూ. 4.7 కోట్లు సరాసరి ఉంది. ఇందులో నుంచి రూ. 78 లక్షలు మెడిక్లైమ్‌ కట్టాం. దానికి ఈసీ మెంబర్స్‌ అందరూ ఒప్పుకున్నారు. అందులో హేమ గారు ఉన్నారు. అప్పుడు కోవిడ్‌ పరిస్థితుల్లో అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు.. ప్రతిదీ రికార్డ్‌ అయ్యి ఉంది.’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img