Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

‘హౌస్ అరెస్ట్‌’… ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. వ‌రుస సినిమాల‌ను రూపొందిస్తోన్న రాబోయే రోజుల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిల‌వ‌డానికి ప్లాన్ చేసుకుంది.

ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డానికి కొంద‌రు సంప్ర‌దించిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు ఆఫ‌ర్స్‌ను వ‌ద్ద‌ని, థియేట‌ర్స్‌లోనే అస‌లు కిక్ ఉంటుంద‌ని భావించి ‘హౌస్ అరెస్ట్‌’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

‘90 ఎం.ఎల్’ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవిబాబు, అదుర్స్ రఘు, రవి ప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. జె.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, చంద్ర‌బోస్ లిరిసిస్ట్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్ర‌స్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌కత్వం:  శేఖ‌ర్ రెడ్డి ఎర్రా
నిర్మాత‌:  కె.నిరంజ‌న్ రెడ్డి
బ్యాన‌ర్‌:  ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఎస్.ఎం.టి చైత‌న్య‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అశ్రిన్ రెడ్డి
సంగీతం:  అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జె.యువ‌రాజ్‌
పాట‌లు:  చంద్ర‌బోస్‌
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  జి.ఎం.శేఖ‌ర్‌
ఫైట్స్‌:  వెంక‌ట్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.సూర్య నారాయ‌ణ‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img