హైదరాబాద్: పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటోయో తెలియదు. పైగా కొవిడ్ కారణంగా చిత్రపరిశ్రమలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర బృందాలు వారి సినిమాలకు సంబంధించి విడుదలు తేదీలు ప్రకటిస్తున్నాయి. ఆ వరుసలో ఉంది ‘గని’ సినిమా. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు దర్శకనిర్మాతలు. ఫిబ్రవరి 25నే ఫిక్స్ చేసినట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాక్సింగ్ చేస్తూ పవర్‌ఫుల్‌గా కనిపించారు వరుణ్. ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ నటించింది. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మించారు.