Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

2న డై హార్డ్ ఫ్యాన్ సినిమా రిలీజ్

సిక్కోలు యువకుడు అభిరామ్ దర్శకత్వం

విశాలాంధ్ర – సినిమా: కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన” డై హార్డ్ ఫ్యాన్” సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 2న శుక్రవారం విజయవంతంగా విడుదలవుతోంది. ప్రధాన నగరాల్లో ఐమాక్స్ థియేటర్లో కూడా ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకులానికి చెందిన యువ దర్శకుడు ఎం.అభిరామ్ కధ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేపట్టగా షకలక శంకర్ కామెడీ, రాజీవ్ కనకాల-నోయల్ సస్పెన్స్ తో కూడిన చిత్రంలో హీరో శివ ఆలపాటి, హీరోయిన్ ప్రియాంక శర్మ థ్రిల్ గా ముందుకు వస్తోంది డై హార్డ్ ఫ్యాన్ సినిమా.. ! చంద్రప్రియ సుబుద్ది నిర్మించిన ఈ సినిమా అభిరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోగా ప్రముఖ దర్శకులు సుకుమార్ ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ట్రైలర్ ఉందని దర్శకుడు అభిరామ్ ని అభినందించారు. అన్ని ప్రధాన నగరాల్లో సినిమా ప్రదర్శిస్తున్నట్లు దర్శకుడు అభిరామ్ తెలిపారు. సినీ రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న శ్రీకాకుళానికి చెందిన అభిరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డై హార్డ్ ఫ్యాన్స్ సినిమాను ప్రేక్షకులందరూ ధియేటర్ కి వెళ్లి చూసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. షకలక శంకర్ కామెడీ తో పాటు ఒక సినిమా అభిమాని కి హీరోయిన్ కి మధ్య జరిగిన సన్నివేశాలు ఎంతో థ్రిల్లింగ్ ,సస్పెన్స్ గాను కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తుందని విశ్వాసం ఉందని దర్శకుడు అభిరామ్ తెలిపారు . ప్రేక్షక దేవుళ్ళందరూ ఆశీర్వదించి ప్రోత్సహించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img