Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అక్టోబరు 6న ఓటీటీలో ‘ఖుషి’

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ-స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబరు 01న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. విజయ్‌ కెరీర్‌ లోని భారీ ఓపెనింగ్స్‌ ను రాబట్టింది. విజయ్‌, సమంతల మధ్య కెమిస్ట్రీకి ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు కీ రోల్స్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యేర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఖుషి సినిమాను నిర్మించారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. ఈ మూవీ అక్టోబరు 06 నుంచి స్ట్రీమింగ్‌ కు రానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్‌ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమాకు హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ మ్యూజిక్‌ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. మరోవైపు విజయ్‌ ఖుషి సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img