Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

నిర్మాత ట్వీట్‌… రాజమౌళి ఫన్నీ రిప్లై

హైదరాబాద్‌: ‘బాహుబలి’ దర్శక-నిర్మాతలు రాజమౌళి, శోభూ యార్లగడ్డ మధ్య సరదా సంభాషణ జరిగింది. ప్రభాస్‌ ‘కల్కి 2898 ఎ.డి’ గ్లింప్స్‌ను ఉద్దేశిస్తూ వీరి మధ్య జరిగిన ట్విటర్‌ చాట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా జక్కన్న కామెడీ టైమింగ్‌కి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఎ.డి.’ని ఉద్దేశిస్తూ రాజమౌళి శుక్రవారం రాత్రి ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. డార్లింగ్‌ లుక్‌ అదిరిపోయిందని, విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. ‘రిలీజ్‌ డేట్‌’ని ఉద్దేశిస్తూ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. దీనిపై స్పందించిన ‘బాహుబలి’ నిర్మాత శోభు.. ‘‘చూడండి రిలీజ్‌ డేట్‌ గురించి ఎవరు అడుగుతున్నారో!!’’ అని సరదాగా బదులిచ్చారు. కాగా, ఇప్పుడీ ట్వీట్‌కు రాజమౌళి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ‘లక్ష్మి’లోని ఓ సీన్‌లో ఏం చేయాలో పాలుపోక బ్రహ్మానందం తికమకపడిన జిఫ్‌ ఫైల్‌ను సమాధానంగా నెట్టింట పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. జక్కన్న హాస్య చతురతకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. మరోవైపు.. రాజమౌళి పెట్టిన ట్వీట్‌పై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ స్పందించారు. ‘‘హ్హహ్హహ్హ.. రాజమౌళి సర్‌.. మీరెంతో మంచివారు. అందరూ చెప్పినట్టుగానే మీ నుంచి ఎన్నో నేర్చుకోవాలి’’ అని అన్నారు. రాజమౌళి ఒక్కో సినిమాని ఏళ్ల తరబడి చెక్కుతూనే ఉంటారనే విషయం విదితమే. అందుకే.. ఆయన రిలీజ్‌ డేట్‌ గురించి ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు సైతం టీజ్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img