Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సీక్వెల్‌?

హైదరాబాద్‌ : భారత చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు కూడా ఈ చిత్రాన్ని వరించింది. చరణ్‌, తారక్‌లను గ్లోబల్‌ స్టార్లుగా, రాజమౌళిని గ్లోబల్‌ డైరెక్టర్‌ గా మార్చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది. ఈ విష యాన్ని సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన్నట్టు ప్రముఖ కాలమిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ ను రాజమౌళి డైరెక్ట్‌ చేస్తారని లేదంటే ఆయన పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారని విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. రాజమౌళి కలల ప్రాజెక్టు అయిన మహాభారతం కూడా వస్తుందన్నారు. మహేశ్‌ బాబుతో రాజమౌళి తీయబోయే జంగిల్‌ అడ్వెంచర్‌ సినిమా పూర్తయిన వెంటనే మహాభారతం తెరకెక్కిస్తారని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారని మనోబాల ట్విట్టర్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img