హైదరాబాద్: విక్రమ్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన కమల్ అదే జోష్‌తో ఇండియన్-2ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కమల్ మణిరత్నంతో సినిమా చేయబోతు న్నాడు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో అందరిలోనూ తిరుగులేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శింబు కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. శింబు క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, కథను మలుపుతిప్పే పాత్రలో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.