ముంబై: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ వేధింపులు ఎదుర్కొన్నారు. విమాన ప్రయాణంలో కొంతమంది వ్యక్తులు తనని ఇబ్బందిపెట్టారంటూ ఆమె తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ముంబై నుంచి గోవాకు ఫ్లైట్‌లో ప్రయాణించిన సమయంలో నేను వేధింపులు ఎదుర్కొన్నాను. కొందరు వ్యక్తులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అభ్యంతరకరంగా మాట్లాడారు. వేధించారు. నేను వారికి ఎదురుతిరిగాను. తమ స్నేహితులందరూ మద్యం సేవించి ఉన్నారని.. అందుకే అలా ప్రవర్తిస్తున్నారని వాళ్ల గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి నాతో చెప్పారు’’ అని ఉర్ఫీ జావేద్ రాసుకొచ్చారు. విభిన్నమైన స్టైల్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. గతంలో హిందీలో తెరకెక్కిన ఓ ధారావాహికలో నటించిన ఆమె ‘బిగ్‌బాస్’ ఓటీటీలోనూ సందడి చేశారు.