Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

రేపు ‘హాయ్‌ నాన్న’ నుంచి మొదటి పాట

హైదరాబాద్‌: సహజ నటుడిగా పేరున్న నాని హీరోగా, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ నుంచి ‘సమయమా’ అని సాగే ఫస్ట్‌ సాంగ్‌ను సెప్టెంబర్‌ 16న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాటను లాంఛ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాట సంగీత ప్రియులను మెప్పించడం ఖాయమని తాజా లుక్‌తో తెలిసిపోతుంది. మేకర్స్‌ ఇప్పటికే లాంచ్‌ చేసిన హాయ్‌ నాన్న టైటిల్‌ గ్లింప్స్‌, గ్లింప్స్‌ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచగా… తాజాగా హాయ్‌ నాన్న మ్యూజికల్‌ ట్రీట్‌ షురూ అంటూ నాని, మృణాళ్‌ ఠాకూర్‌ వీడియో ఒకటి షేర్‌ చేయగా… సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఖుషి తర్వాత మలయాళం కంపోజర్‌, హృదయం ఫేం హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ నుంచి మరోసారి సూపర్‌ హిట్‌ ఆల్బమ్‌ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే నాని టీమ్‌ తమిళనాడులోని కూనూర్‌, ఊటీలో కొత్త షెడ్యూల్‌ పూర్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img