వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగా’ .. సెప్టెంబర్ 2న గ్రాండ్ రిలీజ్
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా..
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేశాను. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తున్నాం. సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతుంది. మా సినిమాలో వైష్ణవ్‌గారు కొత్తగా కనిపిస్తారు. అలాగే కేతికా శర్మ తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆయన ఎనర్జీ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. నిర్మాత ప్రసాద్‌గారు, బాపినీడుగారి సపోర్ట్‌తో సినిమాను చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. దేవిశ్రీగారి మ్యూజిక్, శ్యామ్ దత్‌గారి విజువల్స్ సినిమాకు మేజర్ ఎసెట్స్ అయ్యాయి. టీజర్ చూసినవారు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందన్నారు. మూవీ ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు.