తిరుపతి : పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. కోలీవుడ్‌లో విజయవం తమైన ‘వినోదాయ సిథం’కు రీమేక్‌గా సముద్రఖని దీన్ని రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండోపాట విడుదలైంది. తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ వేదికగా జరిగిన పాట విడుదల కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ పాల్గొన్నారు. కాసేపు సరదాగా అభిమానులతో ముచ్చ టించారు. ‘పెళ్లి ఎప్పుడు?’ అంటూ ఫ్యాన్స్ అడగ్గా.. ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ‘మీ అభిమానాన్ని పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చాను. మా గురువుగారు (పవన్‌కల్యాణ్) నాకు అవకాశం ఇవ్వడం వల్లే ఈ సినిమాలో నేను భాగమయ్యా. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక గొప్ప అనుభూతి. దీన్ని మాటల్లో వర్ణించలేను అని అన్నారు. సాయి మాట్లాడుతుండగా పెళ్లెప్పుడు? అంటూ అభిమానులు ప్రశ్నించారు. వారికి సమాధానం చెబుతూ.. ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేసేవారు. కానీ, ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయ్యాక అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారు’ అంటూ ఆయన నవ్వులు పూయించారు.