Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

29న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌ 2023

వరంగల్‌: ప్రారంభించిన రోజు నుంచీ ప్రతిభావంతులైన కళాకారులు, దర్శకులు,రచయితలు, నిర్మాతలు,చిత్రబృందం అచంచలమైన అంకితభావంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో జీతెలుగు తిరుగులేని ఎదుగుదల కొనసాగుతోందని ఆ ఛానెల్‌ ప్రతినిధి చెప్పారు. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను ప్రదానం చేయడం ద్వారా అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి ఏటా వైభవంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌ వేడుక ఈసంవత్సరం మరింత ఘనంగా జరిగిందని, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌ 2023 వెండితెర, బుల్లితెర తారల తళుకులుతోఅత్యంత వైభవంగా సాగిన కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్‌ 29సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుందన్నారు. అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమానికి ఎనర్జిటిక్‌ యాంకర్‌ శ్యామల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img