విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకులపై, మండల పదవి చేస్తున్న నాయకుడు విరుచుకు పడడంతో మహిళా నాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించడానికి కృషి చేసమని, పట్టణంలో టిడిపి పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మాకు తెలియజేయడం లేదని, నియోజకవర్గ ఇన్చార్జ్ సమక్షంలో అడిగినందుకు మహిళా నాయకులను దుర్భాషలాడుతూ , బెదిరిస్తున్నారని మహిళా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల నాయకులు, నియోజవర్గ నాయకులు, ఉన్నప్పటికీ కనీసం మాట్లాడకపోవడం హర్షణీయంగా ఉందని, సీనియర్ నాయకుడిని కూడా చేతితో నెట్టడం జరిగిందని మహిళలు పేర్కొన్నారు.