విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల జిల్లాస్థాయి పోటీలలో మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థిని నిమ్మల చైత్ర పాల్గొని నెల్లూరులో జరిగే ఎటువంటి రాష్ట్రస్థాయి, ప్రకాశం జిల్లాలో జరిగే ఎటువంటి రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు, పలనాడు జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఎస్జీ.ఎ.ఫ్ స్కూల్ గేమ్స్ లో రబ్బి,రెజ్లింగ్, ఊషు, బాక్సింగ్ అండర్ 17 క్యాటగిరి విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. అలానే రాష్ట్రస్థాయిలో కూడా మొదటి స్థానం సాధించి జాతీయస్థాయిలో కూడా మెడల్స్ సాధించాలని వారు తెలిపారు. అలానే మా స్కూలుకి మా ఊరికి మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయ బృందంతోపాటు విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినీలకు అభినందన
- Advertisement -
RELATED ARTICLES


