Homeహైదరాబాద్సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం..

సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం..

- Advertisement -

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్..

వజ్రేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్..

విశాలాంధ్ర, శామీర్ పేట్ :- శామీర్ పేట డివిజన్ పరిధిలోని తుంకుంటలో గల మల్లన్న ఆలయం నుండి ద్వారకాపురి కాలనీ వరకు ప్రజలు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం తోటకూర వజ్రేష్ యాదవ్ సీసీ రోడ్డు నిర్మాణపనులకు నిధులు మంజూరు చేయించారు. కాగా బుధవారం ఈ పనులను మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని తోటకూర వజ్రేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్ళామని, వారు ఈ విషయమై స్పందిస్తూ నిధులు మంజూరు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకాపురి కాలనీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు పులి నవీన్ రాజిరెడ్డి మల్లన్న దేవాలయ కమిటీ అధ్యక్షుడు బొల్లబోయిన పరమేశ్ యాదవ్, గాలి రెడ్డి, రాజు, శివ, ఎద్దు శ్రీనివాస్, మన్నె బిక్షపతి, మహేష్, సుధాకర్, ఎల్లేష్, కాంట్రాక్టర్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు