Homeజిల్లాలుఅనంతపురంగుంతకల్లు రెండో వార్డులో సీపీఐ అభ్యర్థి రమాదేవి ఘన విజయం..

గుంతకల్లు రెండో వార్డులో సీపీఐ అభ్యర్థి రమాదేవి ఘన విజయం..

- Advertisement -

విశాలాంధ్ర – గుంతకల్లు: గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థి రమాదేవి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థులపై 137 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం సాధించి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రమాదేవి విజయం పట్ల సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, రెండోసారి తనను కౌన్సిలర్‌గా గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మాదిరిగానే వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు వీరభద్రస్వామి, పట్టణ సహాయ కార్యదర్శి మురళీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు