ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లకు అక్టోబర్ 12 వ తేదీ నుండి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల గారి, ప్రైవేట్ పాఠశాలలు గాని ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. అలా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని వారు హెచ్చరించారు. కావున ఫిర్యాదులు రాకుండా పాఠశాల యాజమాన్యం వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు కూడా ఈ దసరా సెలవుల్లో తల్లిదండ్రుల వద్దనే ఉండాలని, వారి సంరక్షణ మీకు అతి ముఖ్యమైన భద్రత అని తెలిపారు. విద్యార్థులు బయటకు పంపేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, చెరువు, కాలువల వద్ద పంపరాదని తెలిపారు. కావున ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు, ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియపరచాలని తెలిపారు.
దసరా సెలవులు అక్టోబర్ 12 నుండి 21వ తేదీ వరకు మాత్రమే..
- Advertisement -
RELATED ARTICLES


