Homeజిల్లాలుఅనంతపురంఓటర్ల జాబితా పరిశీలనకు సెప్టెంబర్‌ 9 వరకు గడువు

ఓటర్ల జాబితా పరిశీలనకు సెప్టెంబర్‌ 9 వరకు గడువు

- Advertisement -

విలేకరులతో మాట్లాడుతున్న ఈఆర్ఓ రామ్మోహన్

విశాలాంధ-ఉరవకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 149-ఉరవకొండ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని నియోజకవర్గ ఈఆర్వో రామ్మోహన్ తెలిపారు. బుధవారం ఉరవకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 286 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 46,206 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సుమారు 4,910 మంది ఓటర్ల మ్యాపింగ్‌ జరగలేదని, 41,287 మంది ఓటర్ల వివరాల్లో మ్యాపింగ్‌ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 43,416 నోటీసులు పంపిణీ చేయగా, 7,550 మంది ఓటర్లు విచారణ పూర్తి చేసుకున్నారని, ఇంకా 38,656 మంది విచారణ పెండింగ్‌లో ఉన్నారని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సెప్టెంబర్‌ 9లోగా సంబంధిత చెల్లుబాటు అయ్యే ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరుకావాలని సూచించారు. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసుకోని లేదా అవసరమైన ఆధారాలు సమర్పించని వారి పేర్లను తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 3న ప్రచురించనున్నట్లు ఈఆర్వో రామ్మోహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అరుణ, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు