శ్రీ సత్య సాయి సేవ సమితి..2 కన్వీనర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల 70 మంది రోగులకు, వందమంది సహాయకులకు ఉపాహారం లో భాగంగా పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి-2 కన్వీనర్, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతో కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. నేటి ఈ కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు పొలమడ సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి భార్యామణి రూపారాగిణి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారికి కన్వీనర్ కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ కన్వీనర్ కు, నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకుమాని సాగర్, సాంబశివుడు, వెంకటేశు, జనార్ధన, వినోద్, రామాంజనేయులు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, సహాయకులకు ఉపాహార పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


