Homeజిల్లాలుకర్నూలుక్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడుబూరు,హెచ్ మురవణి ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ రవిచంద్ర కుమార్ , డాక్టర్ ఫిర్దోస్ ఆధ్వర్యంలో శుక్రవారం పేద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మరియు పి పి ఎం ఉమాపతి మాట్లాడుతూ హెల్త్ సెంటర్ స్టాఫ్ యొక్క సౌజన్యంతో పేద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకారమును గత ఐదు నెలలుగా అందించడం జరుగుతుందని తెలిపారు . ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున నెలకు సరిపడా పోషకాహార కిట్లను ఇలా ఆరు నెలల పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు . ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నిక్షయ మిత్రులుగా చేరేందుకు పేద క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు బాబురాజు, భాస్కర్, శ్రీధర్ ,కిషోర్ కుమార్, సి హెచ్ ఓ ఆది నారాయణ, జి సుశీల పి హెచ్ ఎన్, లక్ష్మీనరసమ్మ , శ్రీదేవి ఫార్మసిస్ట్ మరియు ఆశావర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు