Homeజిల్లాలుఅనంతపురంపోలీసు పిల్లలకు 'ప్రతిభా పురస్కారాలు' అందజేసిన జిల్లా ఎస్పీ పి. జగదీష్

పోలీసు పిల్లలకు ‘ప్రతిభా పురస్కారాలు’ అందజేసిన జిల్లా ఎస్పీ పి. జగదీష్

- Advertisement -


విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ​పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 109 మంది పోలీసు పిల్లలకు జిల్లా ఎస్పీ పి.జగదీష్ బుధవారం ‘ప్రతిభా పురస్కారాలు’ అందజేశారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను బహుకరించారు.
​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో రాత్రింబవళ్లు విధి నిర్వహణలో బిజీగా ఉండే సిబ్బంది పిల్లలు చదువుల్లో రాణించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో దేశానికి, సమాజానికి మంచి పేరు తేలాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం, పలువురు పోలీసు అధికారులు, ఎస్పీ సీసి ఆంజనేయ ప్రసాద్, పలువురు పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సూర్య కుమార్ , గాండ్ల హరినాథ్ , లక్ష్మినారాయణ, సరోజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు