Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘చలో అమరావతి’ రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత

రైల్వేస్టేషన్‌ వద్ద సీపీఐ కార్యకర్తలను అడ్డగించిన పోలీసులు
పోలీసులకు, సీపీిఐ కార్యకర్తలకు మధ్య తోపులాట
సీపీఐ నాయకులు అరెస్ట్‌

రాజమహేంద్రవరం మే 9 పెరుగుతున్న అధిక ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం సీపీఐ చేపట్టిన చలో అమరావతి కార్యక్రమం రాజమహేంద్రవరం లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం షిరిడీ ఎక్స్‌ప్రెస్‌కు వెళ్ళటానికి సీపీఐ ,జట్లు సంఘం కార్యకర్తలు స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద రామాలయం నుండి ప్రదర్శనగా బయల్దేరారు. రైల్వే స్టేషన్‌ లోపలకి వెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించగా టూ టౌన్‌ పోలీసులు అడ్డగించారు. 20 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఆందోళనకారులు లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు కె రాంబాబు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు సేపేని రమణమ్మ, బొమ్మసాని రవిచంద్ర లను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ధరలపై ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వానికి తెలియడం కోసం సీపీఐ శాంతియుతంగా చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని రెండు రోజుల ముందు నుండే సీపీఐ ప్రజా సంఘాల నాయకులను హౌస్‌ అరెస్టు చేశారని ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్‌ చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. శాంతియుతంగా విజయవాడ వెళ్ళటం కూడా రాష్ట్ర ప్రజలకు హక్కు లేదా అని ప్రశ్నించారు. జగన్‌, మోదీ ఇద్దరు కలగలుపుని రోజురోజుకు పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలను పెంచుకుంటూ పోతున్నారని ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని కరెంటు చార్జీలు తగ్గించాలని చెత్త ఆస్తిపన్ను రద్దు చేయాలని లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సప్పా రమణ, పెంట దేవుడు బాబు, ఆర్‌ వెంకట్రావు, జి వెంకట్రావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img