Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ప్యారీ సుగర్స్ ఫ్యాక్టరీలో మరో ప్రమాదం

ఇద్దరు కార్మికులు మృతి

కాకినాడ రూరల్ :కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో వున్న ప్యారీ సుగర్స్ ఫ్యాక్టరీలో సోమవారం మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈనెల 12వ తేదీన ఇక్కడే చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన రాగం ప్రసాద్(45), కె.గంగవరం మండలం పామర్రు కు చెందిన పేరూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు(33) విధులలో ఉండగా సీ-పాన్ మీద పడి మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో స్థానిక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక్కడ ప్రమాదం జరిగి పట్టుమని పది రోజులు గడవక ముందే మరో ప్రమాదం పై స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక సుగర్స్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు కాకినాడ జిల్లాలో ఏ పరిశ్రమలోను అధికారులు పర్యవేక్షణ లోపం కనబడుతోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం, పోలీసులు సంఘటనా స్థలానికి మీడియాను అనుమతించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img