Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎర్రజెండాలతో  ఎరుపెక్కిన రాజమహేంద్రవరం 

ఆకట్టుకున్న కోయినృత్యాలు

రాజమహేంద్రవరం : ప్రజా సమస్యలు పై ప్రతినిత్యం ప్రజలు తరుపున పోరాడే  భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నిర్వహించిన 25వ జిల్లా మహాసభ ర్యాలీలో ఎర్ర జెండాలతో రాజమహేంద్ర వరం నగరం ఎరుపెక్కింది.జిల్లా కేంద్ర మైన రాజమహేంద్రవరం లోని సీపీఐ కార్యాలయం వద్దకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాటి మధు,జిల్లా సహాయ కార్యదర్శిలు కుండ్రపు రాంబాబు,రేఖ భాస్కర రావు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావుతో పాటుగా పార్టీ నాయకులు,అభిమానులు భారీగా చేరుకున్నారు.ఈ సందర్భంగా తొలుత స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రజా ప్రదర్శన ర్యాలీ అన్నపూర్ణ దియేటర్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మెయిన్ రోడ్డు, శ్యామల సెంటర్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. దారి పొడువున 25వ మహాసభలు విజయవంతం కావాల ని,ప్రజా పోరాటాలు వర్ధిల్లాల ని,మతోన్మాదం నశించాలని,రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని,పోలవరం నిర్వాసి తులకు న్యాయం చేయాలని, దళితులపై దాడులు ఆపాల ని,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణం ఆపాలని, హమాలి కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తేవాలని,ప్రజా కలలు వర్ధిల్లాలం టూ దిక్కులు పిక్కటిల్లులా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమదైన శైలిలో అందర్నీ ఆకర్షిస్తు,ప్రజల్లో,యువతలో, ప్రతిఒక్కరిలో చైతన్యం నిపుతూ ర్యాలీ కొనసాగింది.ఎర్రజండాల,ఎర్రచోక్కలతో (దుస్తులు)ప్రజా ప్రదర్శన,ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రేలారే రేలారే కోయి నృత్యాలు,తదితర బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, చూపరులను ఆకట్టుకున్నాయి.

భారత కమ్యూనిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 25వ జిల్లా మహాసభలు పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మండలి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో బహిరంగ సభలో విప్లవలాలపిస్తున్న లక్ష్మణరావు నౌరోజీ శామ్యూల్ ప్రేమానందం రామరాజు కుమార్ మహేష్ పోతురాజు అర్జున్ రావు ఉమామహేశ్వరి రాజేశ్వరి తదితరులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img