Monday, January 30, 2023
Monday, January 30, 2023

అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం

ఆగస్టు 15 నాటికి తాలిబన్లు అఫ్గానిస్థాన్‌పై ఆధిపత్యం సంపా దించడం దాదాపు పూర్తి అయింది. ఇప్పుడు తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ నిర్వహణ బాధ్యత నెరవేర్చడానికి మత సంబంధమైన మండలి ‘‘షూరా’’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ షూరాలో తాలిబన్‌ పెద్దలు, ఇతర జాతుల బృందాల నాయకులు ఉంటారు. ముల్లా అబ్దుల్‌ ఘని బరాదర్‌ కొత్త ప్రభుత్వాధినేతగా ఉండబోతున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో 80 శాతం మంది దోహాలో గడిపిన తాలిబన్‌ నేతలే ఉంటారు. విదేశాంగ వ్యవహారాల బాధ్యత షేర్‌ అబ్బాస్‌ స్టానక్‌ జయ్‌కి అప్ప గించే సూచనలు ఉన్నాయి. ఆయనకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నాయి. అయితే షూరాలో మహిళలకు స్థానం లేదు. తాలిబన్ల ప్రభుత్వం విశాల ప్రాతిపదికపై ఏర్పడుతుందన్న ఆశలు నెరవేరే అవకాశం కని పించడం లేదు. ఈ ప్రభుత్వంలో మాజీ అధ్యక్షుడు కర్జాయ్‌, గుల్బుద్దీన్‌ హిక్మత్యార్‌, అబ్దుల్లా అబ్దుల్లా లాంటి వారికి స్థానం దక్కేట్టు కనిపించడం లేదు. ఒక వేళ ఉన్నా వారు ఎక్కడో కింది వరసలో ఉండక తప్పదు. ఆగస్టు 15న తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడం పూర్తి అయితే ఆగస్టు 31 నాటికి అమెరికా సైనిక దళాలను వెనక్కు పిలిపించడం పూర్తి అయింది. అంటే అఫ్గానిస్థాన్‌లో నూతన శకం ప్రారంభం కానుంది. అంతర్జాతీయ సమాజం తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నం దుకు మొదట నివ్వెర పోయినప్పటికీ క్రమంగా వాస్తవ పరిస్థితిని అంగీ కరించే దశకు చేరుకుంది. అంతర్జాతీయ సమాజం తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఎలా చూస్తుందన్న విషయంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అఫ్గాని స్థాన్‌ మళ్లీ తీవ్రవాదులకు నిలయంగా మారకూడదని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. తాలిబన్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశి స్తోంది. భారత్‌ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమా వేశం ఆమోదించిన తీర్మానంలో తాలిబన్ల ప్రస్తావన లేదు. కానీ ఆగస్టు 30న ఆమోదించిన తీర్మానంలో అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని ఏ దేశం మీద దాడి చేయడానికి, తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి, తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడానికి వినియోగించుకోగూడదని మాత్రం ఉంది. అంతర్జా తీయ సమాజం అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వంతో వ్యవహరించడానికి ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా తాలిబన్‌ ప్రభుత్వం నడుచుకోవలసి ఉంటుంది. ఆ లక్ష్యం నెర వేరుతుందా లేదా అని చెప్పడానికి సమయం ఇంకా ఆసన్నం కాకపోయి నప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటు తీరు చూస్తే అనుమానంగానే ఉంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఈ తీర్మానం ఆమోదించినప్పుడు రష్యా, చైనా దేశాలు వాకౌట్‌ చేశాయి. అయితే అఫ్గానిస్థాన్‌ తీవ్రవాదాన్ని ఎగు మతి చేసే దేశంగా ఉండకూడదన్నదే ఈ దేశాల అభిమతం. మరో వేపు ‘‘చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి’’ అని తాలిబన్లు ప్రకటిం చిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. అఫ్గానిస్థాన్‌ ఖనిజాలకు, ముఖ్యంగా రాగి గనులకు నిలయం. ఈ నిలవలను వెలికి తీయడానికి చైనా సహకరిస్తుందన్న ఆశ తాలిబన్లకు ఉన్నట్టుంది. అఫ్గానిస్థాన్‌లో అనావృష్టి కారణంగా ఆకలి తాండవిస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయింది. తాలి బన్ల దగ్గర డబ్బుకు కొదవ ఉండకపోవచ్చు కాని దేశ ఆర్థిక స్థితి మెరుగుపడితేగాని సుస్థిరత సాధ్యం కాదు. ఈ విషయంలో చైనా, రష్యా లాంటి దేశాలు ఏ మేరకు తోడ్పడతాయో భవిష్యత్‌ పరిణామాలే నిర్ణయి స్తాయి. చైనా అఫ్గాన్‌లో పెట్టుబడి పెట్టి దేశ పునర్నిర్మాణానికి తోడ్పడు తుందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అంటున్నారు. చైనాకు రేవులు, రైల్వేలు, రోడ్లు, పారిశ్రామిక వాడల మీద ఉన్న ఆధిపత్యం అఫ్గానిస్థాన్‌కు ఆఫ్రికా, ఆసియా, యూరప్‌తో ఆర్థిక సంబంధాలకు ఉపయోగపడ్తాయన్నది తాలిబన్ల ఆశ.
తాలిబన్ల విషయంలో చైనా సాను కూలంగా స్పందించినప్పటికీ తాలిబన్‌ కార్యకర్తలు ఉదారవాద వైఖరి అను సరిస్తారని, పరిపాలనతో సహా విదేశాంగ విధానంలోనూ ఉదారంగా వ్యవ హరిస్తారని చైనా ఆశిస్తోంది. తీవ్రవాద శక్తులను ఎదుర్కోవాలని, ఇతర దేశాలతో సామరస్యంగా వ్యవహరించాలనీ అఫ్గాన్‌ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా మెలగాలని కూడా చైనా భావిస్తోంది. ఆర్థిక అభివృద్ధి సాధ్యం కావాలంటే సమ్మిళిత రాజకీయ వ్యవస్థ ఉండాలని కూడా చైనా కోరుకుంటోంది. అన్ని రకాలుగానూ తీవ్రవాద ముఠాలతో సంబంధాలు తెంచుకోవాలని కూడా చైనా అను కుంటోంది. అయితే తాలిబన్లు ఈ ఆకాంక్షలకు అనువుగా వ్యవహరిస్తారా అన్నది అసలు ప్రశ్న.
2010 నుంచి తాలిబన్‌ నాయకులకు ఖతర్‌లోని దోహానే మకాం. వారు అక్కడ నెలవు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం తాలిబన్లకు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి అమెరికాతో సహా ఇతర దేశాలతో సామరస్యం కుద రాలనే. 2013లో తాలిబన్లు దోహాలో కార్యాలయ భవనం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక రకంగా తాలిబన్ల ప్రవాస ప్రభుత్వ రాయబార కార్యాలయం లాంటిది. కానీ అప్పటి అఫ్గాన్‌ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయడంవల్ల శాంతి చర్చలు జరగనే లేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు. దోహాలో మకాం ఉన్న తాలిబన్లకే కొత్త ప్రభుత్వంలో ప్రధానమైన చోటు ఉండడం, భయంకరమైన హక్కానీ నెట్వర్క్‌కు ప్రభుత్వంలో 50 శాతం పాత్ర దక్కనుండడం ఈ ఆశలు నెరవేరవేమోనన్న అనుమానాలకు తావిస్తున్నాయి. వ్యవహారాలన్నీ చక్కబడి కొత్త రాజ్యాంగం రూపొందడానికి కొద్ది నెలల సమయమైనా పడ్తుంది. అప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని తాత్కాలికమైందిగానే పరిగణించాలి. అఫ్గాన్‌ భూభాగంలో చాలావరకు తాలిబన్ల వశం అయినప్ప టికీ పంజ్‌ షీర్‌ లాంటి ప్రాంతాలలో ఇంకా ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. మునుపటి ప్రభుత్వంలో సైనికులుగా ఉన్నవారు, వేలాది మంది ప్రాంతీయ సాయుధులు అహమద్‌ మసూద్‌ నాయకత్వంలో ఏకీకృతమవు తున్నారు. అహమద్‌ మసూద్‌ గతంలో ముజహిదీన్ల కమాండర్‌గా ఉన్న అహమద్‌ షా మసూద్‌ కుమారుడు. మసూద్‌తో సయోధ్య కుదుర్చుకోవడా నికి జరిగిన చర్చలు సఫలం కాలేదు. రెండు దశాబ్దాలపాటు అఫ్గానిస్థాన్లో తిష్ఠ వేసి అర్థంతరంగా అమెరికా సేనలు నిష్క్రమించినప్పటి నుంచి పశ్చిమ దేశాల వారు అఫ్గానిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందించడం పరిమితం అయి పోయింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని అఫ్గాన్‌కు ఆర్థిక సహాయం చేసే దేశాలు, అంతర్జాతీయ సమాజం ఎలా పరిగణిస్తాయన్న అంశమే కీలకం. అఫ్గానిస్థాన్‌ చాలా సంవత్సరాల నుంచి విదేశీ సహాయం మీదే ఆధారపడి ఉంది. అంతర్జాతీయ సహాయం అందకపోతే లక్షలాది మంది ఆకలికి అలమటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశం అయిన తరవాత అమెరికాలో ఉన్న బంగారం, పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్యం మొదలైన వాటిని బైడెన్‌ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img