Monday, September 26, 2022
Monday, September 26, 2022

అమృతోత్సవ వేళా చర్చలేని చట్టాలేనా..!

అమృతోత్సవ వేళ సైతం మోదీ ప్రభుత్వం గత ఎనిమి దేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, విధివిధానాల్లో ఎలాంటి మార్పు లేదు. దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపు కోవాలని ప్రధాని పిలుపు నిచ్చారు. నిజంగా సంబరాలు చేసుకోవలసిన సందర్భమే. పేదరికంలో మగ్గుతూ, ఆకలితో అల్లాడుతున్న కోట్లాది మంది ప్రజలు ఈ సందర్భాన్ని పట్టించు కొనే అవకాశం ఉందా? ఏ మాత్రం లేదని దేశ పరిస్థితులను నిశితంగా పరిశీలించే వారికి అర్థమవుతుంది. 135 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే పార్లమెంటు ద్వారా ప్రభుత్వం చేసే నిర్ణయాలు, చట్టాలపై సుదీర్ఘంగా చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కొంతకాలం కేంద్ర ప్రభు త్వాలు ప్రజలకు మేలు చేసే చట్టాలను రూపొందించడానికి పార్లమెంటులో లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే మంచి సంప్రదాయాన్ని అను సరించాయి. నెహ్రూ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని నెలకొల్పింది. ప్రతిపక్షాలకు గౌరవమిస్తూ, వారు ఇచ్చే మంచి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని ప్రతిపాదిత బిల్లులో చేర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పార్ల మెంటు సమావేశాల్లో చర్చలు ఆసక్తి కలిగించేవి. నెహ్రూ ప్రభుత్వ దార్శనికత వల్ల ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు, విద్య, వైద్య విశ్వవిద్యాలయాలు తదితరం అనేకం ఏర్పడి ప్రజలకు సేవలు అందిం చాయి. పార్లమెంటు తీసుకున్న ప్రజానుకూల నిర్ణయాలు ఇందుకు దోహదం చేశాయి. 2014లో ప్రధాని వచ్చిన తర్వాత తన రహస్య లక్ష్యం నెరవేర్చుకొనే దిశగా అన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసు కుంటోంది. ప్రజలను ఓట్లు వేసే వారిగానే చూస్తూ వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసే సరికొత్త సంప్రదాయాన్ని నెలకొల్పింది. తాజాగా దాదాపు రెండు వారాలు జరిగిన పార్లమెంటు సమావేశాలు ఎనిమిది బిల్లులను ఆమోదించింది. ప్రజ లపై ప్రతికూల ప్రభావాన్ని చూపి ఇప్పటికే అతలాకుతలమైన వారి జీవితా లను మరింతగా దుర్బరం చేసే బిల్లులను సైతం మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. దేశ ప్రజలను మరింత దారిద్య్రంలోకి నెట్టి వారిపై ఆర్థిక భారాలను మోపే నిర్ణయాలను చర్చించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆమోదించిన బిల్లుల్లో సెంట్రల్‌ యూనివర్సిటీల సవరణ బిల్లు ఉంది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొ రేట్ల, బడా పారిశ్రామికవేత్తల లాభాలను చేకూర్చే వాటిల్లో ఇదొకటి. ఇప్ప టికే విద్యా రంగాన్ని ప్రైవేటీకరించి చదువులను ప్రజలందరికీ అందు బాటులో లేకుండా చేసే నిర్ణయా లను గత, నేటి ప్రభుత్వం తీసుకున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని అన్ని సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టా లని కంకణం కట్టుకున్నది. ప్రజలు అందించిన సహకారంతో ఎన్నికల్లో గెలిచి తన పాలనలో ఆ ప్రజలనే మోసగిస్తూ తనకు, తన ఆశ్రితులకు అనుకూలంగా నిర్ణయాలు చేశారు. తాజాగా పార్లమెంటు ఆమోదించిన కుటుంబ కోర్టుల సవరణ బిల్లు నేర విచారణ క్రమాన్ని సవరించే బిల్లు తదితరాలున్నాయి. ఇవన్నీ ప్రజా జీవితాలను ప్రభావితం చేసేవే కావడం వల్ల పార్లమెంటు సమగ్రంగా చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి చట్టాలు చేయవలసిన అవసరం ఉందని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనలు సైతం ఈ ప్రభుత్వ లోపాన్ని ఎత్తి చూపిందని భావించాలి. అయి నప్పటికీ ప్రభుత్వ తీరు తెన్నుల్లో ఇసుమంత కూడా మార్పులేదని ఇటీ వల జరిగిన పార్లమెంటు సమావేశాలు మరింత స్పష్టం చేశాయి. ఈ సమావేశాల నిర్వహణ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇదంతా ప్రజల కష్టార్జితమన్న స్పృహ పాలకులకు ఏ మాత్రం లేదు. మొక్కుబడిగా నిర్వహిస్తున్న పార్ల మెంటు సమావేశాలు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవ డానికేననేది నిర్వివాదాంశం.
సమావేశాల్లో ప్రతిపాదించిన మరో బిల్లు విద్యుత్‌ (సవరణ) బిల్లు, ప్రతి పక్షాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ బిల్లును ఆమో దింపజేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాదాస్పదమైన రైతుల జీవితాలను, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే మూడు వ్యవ సాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు మహత్తర పోరాటం చేశారు. ఈ చట్టాలను రూపొం దించే సందర్భంగానే విద్యుత్‌ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏడాదికి పైగా రైతులు సాగించిన మహోద్యమానికి దేశ కార్మిక వర్గం, ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. యుపి, పంజాబ్‌, తదితర ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామన్న భయంతో మూడు వ్యవసాయ చట్టాలను మోదీ ఉపసంహరించుకొన్నారు. అప్పుడే విద్యుత్‌ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం అమలు జరగ లేదు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లును ఎట్టకేలకు సెలక్టు కమిటీ పరిశీల నకు పంపడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆయా రాష్ట్రాల రైతు లకు, గృహ వినియోగదారులకు మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తాయ నేది సుస్పష్టం.
రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో విద్యుత్‌ పంపిణీ డిస్కంలకు నష్టాలు వస్తు న్నాయనే సాకుతో ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 42ను సవరిస్తారు. దీని ద్వారా విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ లోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశ పెడతారు. క్రమంగా అజమాయిషీ నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. ప్రైవేటురంగం ఇష్టారాజ్యంగా విద్యుత్‌ ఛార్జీలను పెంచుతుంది. దేశంలో మారుమూలనున్న ప్రజ లందరికీ విద్యుత్‌ను అందిం చాలన్న గొప్ప లక్ష్యాన్ని ప్రైవేటు రంగం పట్టించుకోదు. ఇప్పటికే అనేక వేల గ్రామాల ప్రజలు విద్యుత్‌ వెలుగులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే వినియోగదారులందరూ మోదీ పాలనలో అన్ని వస్తువుల ధరల మోతను విద్యుత్‌ ఛార్జీల మోతను భరించ వలసిందే. రైతులు పోరాటం చేసేటప్పుడే దీన్ని వ్యతిరేకించారు. లాభాలు వచ్చే ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ సంక్షోభంలోకి వెళుతుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఈ నెల 8వ తేదీనే 27 లక్షల మంది విద్యుత్‌ ఇంజ నీర్లలో అత్యధికం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక భారాలను మోయడానికి అలవాటుపడిన ప్రజలూ గట్టిగా స్పందించవలసిన సమయమిది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img