Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ఆదిలోనే హంసపాదు

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ, ఆర్థికవ్యవస్థ సముద్ధరణ కోసం ప్రతిపక్షాలన్నీ ఐక్యమై 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలన్న లక్ష్యానికి ఆదిలోనే హంసపాదు పడిరది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రతిపక్ష ఐక్యతకు గండి కొట్టారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీ ప్రభుత్వాన్ని ఓడిరచాలన్న ప్రతిపాదనను మొదట మమత ప్రతిపాదించారు. ఈ దిశలో ప్రయత్నం కూడా చేశారు. దిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ నాయకులతోనూ మంతనాలు జరిపారు. తర్వాత మౌనం దాల్చారు. రాష్ట్రంలోని 42 సీట్లనూ తాను గెలుచుకొని ప్రధానమంత్రి పదవినీ ఆశించారు. ఒంటరి పోటీ ప్రకటనకు తక్షణ ప్రేరణ బెంగాల్‌లో ఇటీవల సార్దిఫీు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వామపక్ష కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి తృణమూల్‌ అభ్యర్థిపై గెలుపొందారు. అత్యధిక ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మళ్లుతున్నారన్న సంకేతం ఈ ఎన్నికల ఫలితం అందించింది.  ఈ తాజా పరిణామం మమతను తీవ్ర ఆందోళనకు గురిచేసిఉంటుంది. దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం ఆమెకున్న అలవాటే.  ప్రతిపక్షం ఐక్యమై బీజీపీని ఓడిరచకపోతే ప్రజలకు, దేశానికి, కలగనున్న ప్రమాదాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే ప్రకటన చేశారని దుందుడుకు స్వభావాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువై జైలు శిక్షపడితే రానున్న ఎన్నికల్లో తృణమూల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినా తగలవచ్చు. దీని నుంచి తప్పించుకునేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనా మమత తీసుకున్న దేశ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యామ్నాయ ప్రభుత్వ లక్ష్యంపై సమ్మెట దెబ్బ వేశారు. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేసి ఎంత మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార్దిఫీులో గెలుపు నల్లేరు మీద నడక అనుకున్న మమతకు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు విభ్రాంతి కల్పించింది. ప్రతిపక్ష ఐక్య కూటమి ఏర్పడినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు పెద్ద క్లిష్ట సమస్యగా మారవచ్చు. బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యమైనప్పుడు గరిష్టంగా సర్దుబాట్లు, త్యాగాలు తప్పనిసరి అవుతుంది. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్‌ సంకేతమిచ్చి చర్చలు జరపాలని భావిస్తున్నట్లు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ప్రకటన తెలియజేసింది. ప్రతిపక్షం ఐక్యతకోసం కృషి చేయడానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ తదితరులు సిద్ధంగానే ఉన్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుట్టినరోజు వేడుకకు హాజరైన వివిధ పార్టీలనేతలు ప్రతిపక్ష ఐక్యతకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌లేని ప్రతిపక్ష ఐక్యత ప్రయోజనం కలిగించబోదని, గతంలో నితీశ్‌కుమార్‌, తాజాగా స్టాలిన్‌ ప్రకటించారు. మొదటి నుంచి సీపీఐ ఇతర వామపక్షాలు బీజేపీ నాయకత్వంలో మోదీ ప్రభుత్వ విధ్వంసకర విధానాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రతిపక్షం ఐక్యతను ప్రతిపాదించాయి. ఈ తరుణంలో మమత ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తుంది. రాహుల్‌ గాంధీ జోడోయాత్ర సానుకూల పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే యాత్ర ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగాయి. పూర్తిగా ఆశ్రిత పెట్టుబడీదారీ విధానాన్ని అనుసరించడంతో కుబేరుల పెరుగుదల, పేదరికం మిక్కుటమయ్యాయి. మొత్తం జాతి ఆదాయంలో 50శాతం దిగువ, మధ్య తరగతి ప్రజల వద్ద సంపద 13శాతమేనని, జాతి సంపదలో వీటికి 3శాతమే ఉందని, అభివృద్ధిలో వీరికి దక్కింది అతిస్వల్పమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు వెల్లడిరచిన గణాంకాలు తెలియ జేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, కొవిడ్‌ కాలంలో పరిశ్రమలు తదితర అన్ని రంగాలు మూతపడడానికి కారణమైన లాక్‌డౌన్‌ దేశ ప్రజల ఆర్ధిక పరిస్థితులను తల్ల క్రిందులు చేశాయి. ఎన్నికల బాండ్ల ద్వారా దొడ్డిదారిన నల్ల ధనాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అవినీతి పెచ్చరిల్లింది. బీజేపీలో ఎంతటి అవినీతి పరులున్నా రనడానికి తాజాగా కర్ణాటక ఎంఎల్‌ఏ విరూపాక్ష కొడుకు ఇంట్లో నోట్ల కట్టల గుట్టలున్నాయని లోకాయుక్త దాడుల్లో వెలుగుచూసింది. తండ్రి తరఫున కొడుకు కాంట్రాక్టరు నుండి రూ.40లక్షలు లంచం తీసుకొంటుండగా పట్టుబడ్డాడు. ఇలాంటి అవినీతి పరులను రక్షిస్తూ ప్రతిపక్షనాయకులపై అవినీతి ముద్రవేసి వేధిస్తున్నారు. మేధావులపైన వివిధ రకాల ఆరోపణలుచేసి తప్పుడు కేసులు బనాయించి ఏళ్లతరబడి జైల్లో పెట్టి హింసిస్తున్నారు.
నేటి పాలకులు రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్‌, సీబీఐ, ఈడీ లాంటి సంస్థల స్వతంత్రతను హరించిన ప్రభుత్వం వీటిని సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సర్వరంగాల్లో కీలకస్థానాల్లో స్వాతంత్య్రపోరాటం పాత్రలేని, దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలను నింపుతున్నారు. ప్రభుత్వరంగంలో ప్రజల కష్టార్జితంతో నిర్మించిన సంస్థలన్నింటినీ ఆశ్రిత పెట్టుబడి దారులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని అవలంబిస్తున్నారు. బహుళత్వాన్ని నాశనంచేసి మెజారిటీ మతాన్ని అన్ని విధాలుగా ప్రలోభపెట్టి ఓట్లు పొంది ఇష్టానుసారంగా ప్రజాస్వామ్య రహితంగా ఫాసిస్టు భావజాలంతో పాలిస్తున్న ఈ శక్తుల నుంచి విముక్తి కల్పించడానికి ప్రతిపక్ష ఐక్యత నేటి అవసరం. ఇదిజరగకపోతే దేశ స్వరూపం ఇలాగే ఉంటుందన్న హామీలేదు. దేశం తీవ్ర ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోదీ సన్నిహితుడు గౌతం అదానీ లాంటి వారు మిక్కుటమవుతారు. కుంభకోణాలకు పాల్పడి ప్రజలను కష్టాలపాలు చేసే మోసకారులు పెరుగుతారు. ఈ పరిస్థితులుమారి ప్రజలకు మేలు జరగాలంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు జరగాలి. ఈ లక్ష్యానికి తూట్లు పొడిచే వారు ప్రజాద్రోహులుగా మిగిలిపోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img