Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

కశ్మీర్‌లో పాగాకు బీజేపీ కుటిల యత్నాలు

హిందువుల ఓట్లను ఎలా దండుకోవాలి అన్న విషయంలో భారతీయ జనతా పార్టీ అనితర సాధ్యమైన ఆధిపత్యం సంపాదిం చింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న జమ్మూ-కశ్మీర్‌ లాంటి చోట్ల అధికారం సంపాదించడానికి కూడా బీజేపీ మార్గం కని పెట్టింది. స్థానికేతరులకు కూడా ఓటర్ల జాబితాలో స్థానం కల్పించే కార్యక్రమం ప్రారంభించింది. సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలను మోదీ ప్రభుత్వం తన పరిచారికలుగా మార్చుకుంది. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్‌ను మాత్రం ఎందుకు వదిలి పెడ్తుంది? జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేసి మూడేళ్లు అయింది. కశ్మీర్‌, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతా లుగా మార్చింది. అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మోదీ సర్కారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరగా ల్సిందే. అయితే అధికారం తమకే దక్కాలంటే మునుపు ఉన్న పరిస్థి తుల ప్రకారం కుదరదు కనక తమకు అనుకూలమైన ఓటర్ల సంఖ్య పెంచే పనిలో పడిరది. అంటే అక్కడి జనాభా స్వరూపం మార్చ డానికి బీజేపీ సిద్ధమైంది. జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో శాశ్వతంగా నివాసం ఉంటున్నవారు కాకపోయినా తమ పేర్లు ఓటర్ల జాబితాలో చేర్పించుకోవచ్చునని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది ప్రజా స్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడమేనని ప్రతిపక్షాలు ఆందోళన చెందు తున్నాయి. జమ్మూ-కశ్మీర్‌ ప్రజల్లో ముస్లింలే అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ దేశ విభజన సమయంలో వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోకుండా భారత్‌లోనే ఉండిపోవాలనుకున్నారు. ఎన్నికలు జరిగిన అనేకసార్లు అక్కడ కేంద్ర ప్రభుత్వ అండదండలతో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్‌లో కాంగ్రెస్‌ లాంటి రాజకీయ పార్టీల కన్నా ఎప్పుడూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ పలుకుబడి ఉంటూ వచ్చింది. కాంగ్రెస్‌ కొన్ని సార్లు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ప్రస్ఫుటంగా కనిపించేది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత జమ్మూ-కశ్మీర్‌లోనూ పాగా వేయాలనుకుంది. ముస్లిమేతరులు అధిక సంఖ్యలో ఉండే జమ్మూలో గణ నీయమైన విజయాలు కూడా సాధించింది. మహబూబా ముఫ్తీ నాయ కత్వంలోని పి.డి.పి. వేర్పాటు ధోరణులను ప్రోత్సహిస్తుంది అని ఆరోపించిన బీజేపీయే పి.డి.పి.తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో అధికారం చెలాయించింది. అర్థాంతరంగా పి.డి.పి.కి మద్దతు ఉపసంహరించింది. ఒంటరిగా అధికారంలోకి రావా లన్న దుగ్ధతో ఓటర్ల నమోదు కార్యక్రమ నియమ నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఆగడాల తరవాత ప్రతిపక్ష పార్టీలు గుప్కార్‌ అలయన్స్‌ ఏర్పాటు చేసి బీజేపీని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తు న్నాయి. ఐక్య కార్యాచరణ ఖరారు చేయడానికి సమావేశం నిర్వహించా లని గుప్కార్‌ కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. ఈ కూటమిలో భాగస్వామ్య పక్షాలు కాని పార్టీల నాయ కులను కూడా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా సంప్రదిస్తున్నారు. ఈ సమావేశం వచ్చే సోమవారం జరగనుంది.
స్థానికేతరులకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించే ప్రయత్నాలను అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని పి.డి.పి. నాయకురాలు మహ బూబా ముఫ్తీ దేశంలోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో స్థానికేతరులకు చోటు కల్పించడం ఎన్నికలకు ముందే అక్ర మాలకు పాల్పడడం అని మహబూబా భావిస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్ని కలలో 25 లక్షల మంది స్థానికేతరులకు ఓటు వేసే అవకాశం కల్పించి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంలోనే కాక అన్ని రాష్ట్రాలలోనూ తమ పార్టీ అధికారమే కొనసాగాలన్నది మోదీ లక్ష్యం. జమ్మూ-కశ్మీర్‌లో పరి స్థితి భిన్నమైంది కనక అక్కడ స్థానికేతరులకు ఓటర్ల జాబితాలో అవకాశం కల్పించి జమ్మూ, లద్దాఖ్‌ ప్రాంతాలలోనే కాకుండా కశ్మీర్‌ లోయలోనూ తమ ఆధిపత్యం కొనసాగేట్టు చేయాలన్నది మోదీ ఎత్తుగడ. స్థానికేతరులకు ఓటర్ల జాబితాలో చోటు దక్కితే జమ్మూతో పాటు కశ్మీర్‌ ప్రాంత ఓటర్ల ఓట్లు కూడా ఎందుకూ కొరగాకుండా పోతాయి. ఇతర రాష్ట్రాలలో డబ్బు సంచులు గుమ్మరించి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రత్యర్థుల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలను ఉసిగొల్పి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అధికారం సంపాదించే ప్రక్రియను బీజేపీ ఇదివరకే దివ్యంగా అమలు చేస్తోంది. జమ్మూ-కశ్మీర్‌లోకి ఏకంగా తనకు అనుకూలమైన ఓటర్లనే ఎగుమతి చేయడానికి మోదీ ప్రయత్నిస్తు న్నారు. అయితే బీజేపీ అగ్ర నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జమ్మూ-కశ్మీర్‌లో స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా ఎన్నికలు నిర్వహించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వాజపేయికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండేది. మోదీ నాయకత్వంలోని బీజేపీ మాత్రం మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓటర్ల జాబితాలో స్థానికేతరులకు అవకాశం కల్పించి జనాభా స్వరూపాన్నే సమూలంగా మార్చాలని కంకణం కట్టుకున్నది. వైవి ధ్యాన్ని ఏ మాత్రం భరించలేని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందనడానికి జమ్మూ-కశ్మీర్‌లో తాజా పరిణామాలే ప్రబల నిదర్శనం. 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో ఆ ప్రాంతం ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జమ్మూ-కశ్మీర్‌ భారత యూనియన్‌లో చేరడానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. హామీలు గుమ్మరించారు. అయితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ హామీలను ఉల్లం ఘించిన సందర్భాలే ఎక్కువ. దీనితో కశ్మీర్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మీద అపనమ్మకం పెరిగింది. 370వ అధికరణం కారణంగానే జమ్మూ-కశ్మీర్‌లో తీవ్రవాదం పెట్రేగి పోతోందని, వెనుకబడి ఉందని బీజేపీ వాదిస్తూ వచ్చింది. కానీ 370వ అధి కరణం రద్దు తరవాత అక్కడి పరిస్థితులు మారిన దాఖలాలు లేవు. తీవ్ర వాదం తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా దానికి కారణం అక్కడ లక్షల సంఖ్యలో భద్రతా దళాలను మోహరించడమే. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమే. వాస్తవ పరిస్థితి తెలియడానికి అవకాశమే లేనప్పుడు ఏం జరుగుతోందో, ప్రజల అభిప్రాయం ఏమిటో బయటపడే అవకాశమే లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో అస్తిత్వమే లేని బీజేపీ ఇప్పుడు అధికారం కబళించ డానికి సకలవిధ ప్రయత్నాలూ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీ ఆగడాలను నిలువరించగలిగితే తప్ప అక్కడ ప్రశాంత పరిస్థితి ఏర్పడదు. ప్రజల ఆకాంక్షలు వ్యక్తమయ్యే అవకాశమూ రాదు. ఆ ఆకాంక్షలు నెరవే రడం సుదూర స్వప్నమే. ఒక జాతిని, ఒక ప్రాంతం వారిని సకలవిధ మాయోపాయాలు ప్రయోగించి అణచి పెట్టడానికి చేసే ప్రయత్నం తాత్కాలికంగా ఫలించినా అసలు సమస్య మాత్రం అలాగే మిగిలి పోతుంది. అధికారం కబళించడమే తప్ప సమస్య పరిష్కరించడం బీజేపీ ఉద్దేశం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img