London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

కులగణనకు తలొగ్గిన సంఫ్‌ు

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) సైతం ఎట్టకేలకు కులగణన గురించి మాట్లాడవలసి వచ్చింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిలభారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఈ విషయం ప్రకటించారు. కేరళలో మూడు రోజులపాటు ఆర్‌.ఎస్‌.ఎస్‌. సుదీర్ఘ మంతనాలు జరిపి కులగణనను సమర్థించాలని నిర్ణయించింది. కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు జనబలం ఏమీ లేదు. అనేక దశాబ్దాలుగా కేరళలో శాసనసభలో అడుగు పెట్టాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌. విశ్వప్రయత్నం చేస్తోంది. అయినా ఇన్నేళ్లకు ఒక్క చోట మాత్రమే కమలం వికసించగలిగింది. కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు విస్తృతమైన సంస్థాగత ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ అయిదువేల ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖలు ఉన్నాయి. మరే రాష్ట్రంలోనూ ఇన్ని శాఖలు లేవు. అంటే కేరళలో పాగా వేయడానికి ఎంతగా ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కులగణన గురించి రక రకాల పద్ధతుల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నవారు ఇప్పుడు కులగణనను సమర్థిస్తున్నామని చెప్పుకోవడానికి నానా పాట్లూ పడ్తున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కులగణనను సమర్థించడం అంటే మోదీ సర్కారు ఆ ఏర్పాట్లలో ఉందనుకోవాలి. లేదా మోదీ మెడలు వంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆ పని చేయిస్తూ ఉండాలి. ఈ రెండిరట్లో ఏదో ఒకటి నిజం కాకపోతే మోదీ సర్కారు బహిరంగంగా ఇంతవరకు చెప్తూ వస్తున్నట్టుగా కులగణన అత్యంత ప్రమాదకరమైంది అనైనా ప్రకటించాలి. ఇంతకాలం మోదీ తన దృష్టిలో నాలుగే కులాలు ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. కులగణనకు అంగీకరిస్తే ఈ నాలుగు కులాల పరిధి దాటి వేలాది కులాలకు చెందిన వారి లెక్కలు వేయించాల్సి వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కులగణన గురించి గట్టిగా మాట్లాడడమే కాదు బీహార్‌లో కులగణన చేయించారు కూడా. గత ఆగస్టు అయిదో తేదీన ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికార పత్రిక పాంచజన్యలో కులగణనను వ్యతిరేకిస్తూ హితేశ్‌ శంకర్‌ పెద్ద వ్యాసం రాశారు. భారతీయుల కులం ఏది అన్న ప్రశ్నవేసి ఆయన హిందువు అని ఆయనే సమాధానం చెప్పారు. అంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికార పత్రికలో రాసిన దాన్నిబట్టి హిందువు అన్న ఒకే ఒక్క కులం ఉందన్న మొండి వాదనను ఆర్‌.ఎస్‌.ఎస్‌. హఠాత్తుగా విడనాడి కులగణనకు ఎందుకు అంగీకరించిందో అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కులగణనవల్ల దేశంలో విభేదాలు, వైమనస్యం పెరుగుతాయని ఆ వ్యాసంలో వాదించారు. అలాంటప్పుడు నెల తిరక్కుండానే కులగణనపై ఆర్‌.ఎస్‌.ఎస్‌. వైఖరి మారిన వైనం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తి తీరుతుంది. మండల్‌ నివేదిక తరవాత కేవలం కులంబలం ఆధారంగా ఏర్పడిన రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ వీటివల్ల దేశం విడిపోయిన దాఖలాలు లేవు. మన దేశంలో కులం ఒక కఠోర వాస్తవం. దాన్ని తప్పించుకోలేం. కులగణన కారణంగా కులాలమధ్య విభేదాలు పెరుగుతాయన్నది కేవలం కట్టు కథే. కులాల సమీకరణే బీజేపీ ఎన్నికల ప్రధాన ఎత్తుగడగా మోదీ హయాంలో పదేళ్ల నుంచి భేషుగ్గా కొనసాగుతోంది. అమిత్‌ షా ఇందులో దిట్ట అని అనేక సార్లు రుజువైంది. కులాలు సమాజాన్ని నిలువునా చీలుస్తాయన్నది సంఫ్‌ు పరివార్‌ నిశ్చితాభిప్రాయం అయితే కులగణన జరిపించిన నితీశ్‌ కుమార్‌ అందించిన కొయ్యకాలు మీద మోదీ ప్రభుత్వం ఎందుకు నిలబడ్డట్టు? కులగణనను వ్యతిరేకిస్తూ సంఫ్‌ు భావజాలం ఉన్నవారు వివిధ పత్రికలలో ముఖ్యంగా సంఫ్‌ు పరివార్‌ నడిపే పత్రికలలో డజన్ల కొద్దీ వ్యాసాలు రాశారు. ఇక వీరు ఏ అంశం గురించి రాయాలో పాపం! కులగణనవల్ల హిందువుల ఐక్యతకు భంగం కలుగుతుంది అని ఇంతవరకు వాదించిన సంఫ్‌ు పరివార్‌ కుదురులోని వారు తమ ఆత్మను చంపుకుని వాదనలు వినిపించడానికి ఎన్ని తంటాలు పడాలో!
సంక్షేమ పథకాలు అందజేయడానికి, ప్రధానంగా చాలా వెనుకబడి ఉన్న కులాల వారి సంక్షేమ పథకాలకోసం కులగణన అవసరం అని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఇప్పుడు అంగీకరిస్తోంది. సంఫ్‌ులో ఇంతటి మార్పు ఎందుకు వచ్చినట్టు? ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కులాలవారీ లెక్కలు అవసరమవుతాయని అంబేకర్‌ అంటున్నారు. కులగణనను రాజకీయాలకు వినియోగించుకోకూడదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఒక షరతు పెడ్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలు అంటే అది ఆర్థిక అంశాలతో విడివడి ఉండదు. కచ్చితంగా అందులో రాజకీయాలు ఇమిడి ఉంటాయి. ఎన్నికల కోసం కుల సమీకరణను బీజేపీ ఆలింగనం చేసుకుంటున్నప్పుడు కులగణన మాత్రమే రాజకీయాలకు వినియోగించుకుంటారన్న అనుమానం రావడం ఇప్పటి దాకా తాము వ్యతిరేకించిన విషయాన్ని సమర్థించుకోవడానికి మార్గాలు వెతుక్కోవడమే. కులగణన రాజకీయ ఆలోచనల పరిణామ ఫలితం అన్న వాస్తవాన్ని నిరాకరించడం దండగ. పొద్దంతా కులాల ఆధారంగా రాజకీయాలుచేస్తూ చీకటి పడేసరికి కులగణన ఆధారంగా రాజకీయాలు వద్దు అనడం వితండవాదమే. లేదా ఇప్పటికి దాకా తమ తప్పుడు ఆలోచనను కప్పి పుచ్చుకోవడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. తొడుక్కుంటున్న ముసుగు అనుకోవాలి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కులగణన ప్రధాన అంశంగానే ఉంది. సార్వత్రిక ఎన్నికలలో కులగణనను సర్వశక్తులూ కూడదీసుకుని వ్యతిరేకించిన సంఫ్‌ు పరివార్‌ ఇప్పుడు కులగణనకు విధిలేక తలవంచడం కన్నా నాసిరకం రాజకీయం మరేముంటుందో! తమకు అధికారంవస్తే కులగణన జరిపించడమే కాక రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50శాతం పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలను దొంగిలించిన బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్ల పరిమితిని పెంచడానికి సిద్ధ పడ్తుందో లేదో కూడా తేలాలి. కేవలం కులగణను సమర్థిస్తున్నామని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రకటిస్తే సరిపోదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ మానస పుత్రిక అయిన బీజేపీ కూడా కులగణనను అంగీకరిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించే రోజు ఎంతో దూరంలో ఉండదు. మోదీ మెడలు వంచి అయినా ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆ పని చేయిస్తుంది. మోదీ ముఖారవిందం చూసి ఓట్లేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందన్న వాస్తవాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతలు మోహన్‌ భగవత్‌, దత్తాత్రేయ హొస్బలే కూడా గ్రహించారు. మోదీ వ్యవహార సరళే ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని ఈ ఇద్దరు సంఫ్‌ు నేతలు దాపరికం లేకుండానే చెప్పేశారు. రిజర్వేషన్లు కల్పించడం సంఫ్‌ు పరివార్‌కు ఎన్నడూ ఇష్టం లేదు. కానీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే దేశవాసుల్లో ఎంతటి తిరుగుబాటు వస్తుందో మొన్నటి ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మోదీకి మొహమాటం అడ్డు రావచ్చు. కానీ తన మానసిక పుత్రిక బీజేపీ మోదీతో నిమిత్తం లేకుండా కొనసాగాలన్నది ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆకాంక్ష. ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు కేటాయించేటప్పుడు, మంత్రిపదవులు భర్తీ చేసేటప్పుడు అక్కరకొచ్చే కులం ప్రస్తావన శాస్త్రీయ పద్ధతిలో కులగణన అవసరం లేదని వాదించే అవకాశం లేకుండా ఆర్‌.ఎస్‌.ఎస్‌. వైఖరిలో మౌలికమైన మార్పు వచ్చింది. కాదు – కులగణనకు సంఫ్‌ు పరివార్‌ లొంగిపోక తప్పలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img