Monday, January 30, 2023
Monday, January 30, 2023

క్రిప్టో కరెన్సీ ఢమాల్‌

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై విపరీతమైన మోజు ఏర్పడిరది. ఇది కళ్లకు కనిపించదు, చేతులతో లెక్కించేది కాదు. అయినప్పటికీ ఈ కరెన్సీని కొనుగోలు చేసేవారి సంఖ్య అపారంగా పెరిగింది. మన దేశంలోనూ ఈ కరెన్సీని అనుమతించరాదన్న డిమాండ్‌ వచ్చింది. దీనిపై నియంత్రణ పెడతామని రిజర్వు బ్యాంకు చెప్పగా పార్లమెంటులోనూ దీనిపై స్వల్ప చర్చ సాగినప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. క్రిప్టో కరెన్సీలో అనేక సంస్థలు ప్రవేశించి వ్యాపారం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా క్రిప్టోకరెన్సీ సంస్థల ధరలు ఢమాల్‌మన్నాయి. దాదాపు లక్ష బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నష్టం జరిగిందన్న అంచనాలతో కోట్లాదిమందిలో ఏనాడూ లేనంతగా ఆందోళన పెరిగింది. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. క్రిప్టోకరెన్సీతో వ్యాపారం చేస్తున్న వందలాది సంస్థలు దివాలా తీశాయి. ఈ కరెన్సీలోకి వందలాదిమంది ప్రవేశించి వ్యాపారం చేస్తున్నారు. ఈ కరెన్సీలో మొదటి సంస్థ బిట్‌కాయిన్‌. అన్ని విషయాల్లోనూ దీనిని బంగారంతో సమానంగా పరిగణించారు. గత వారం ఇది ఒక్కసారిగా కుప్పకూలింది. బిట్‌కాయిన్‌ విలువ గత ఏడాది 75శాతం పెరగగా, గత వారం ఒకేసారి మూడువంతులు పడిపోయింది. బంగారం, అమెరికన్‌ డాలరు లేదా మరో ఇతర కరెన్సీకంటే విలువైనదిగా బిట్‌కాయిన్‌ పేరు పొందింది. బిట్‌కాయిన్‌ కంటే అనేక ఇతర సంస్థలు మరింతగా నష్టపోయాయి. ఏడాదికాలంలో అనేక సంస్థల కరెన్సీ విలువ 80`90శాతం పడిపోయి పూర్తిగా ఈ రంగం నుంచి తుడిచిపెట్టుకు పోయిందన్నది నేటి వాస్తవం. బిట్‌కాయిన్‌లో పెట్టుబడిపెట్టిన వారిలో 90శాతం నష్టాల్లో చిక్కు కున్నారు. ఇందులోకి వచ్చిన సంస్థల్లో ఎఫ్‌టీిఎక్స్‌, ఎఫ్‌టీటీి, బినాన్స్‌ తదితర వందలాది సంస్థలు మళ్లీ ఈ వాణిజ్యంలో కొనసాగే అవకాశాలున్నాయా అనేది ప్రశ్నార్థకం. క్రిప్టో ఎక్చేంజ్‌ వేదికలలో అతి పెద్దది. ఖాతాదారుల డిపాజిట్లతో విచ్చలవిడిగా కొనుగోలు చేయడం ద్వారా ఇతరసంస్థల విలువను పెంచాయి. తద్వారా స్వలాభం పొందాయి. అలాగే భారీగా అవకతవకలకు యాజమాన్యాలు పాల్పడడం, అనేక సంస్థలు కుప్పకూలడానికి ప్రధాన కారణాలు. వీటిలో వాణిజ్యం చేసినవారు, తమ కరెన్సీలను దాచుకున్న వారు కుదేలయ్యారు. ఎఫ్‌టీఎక్స్‌ సంస్థ అమెరికా కోర్టులో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిందన్న వార్తలు వచ్చాయి. ఈ సంస్థ సీఈఓ గతంలో వాల్‌స్ట్రీట్‌లో వాణిజ్యం చేసిన శ్యామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడర్‌ రాజీనామా చేశారు. 2019లో ఇందులోకి వచ్చిన ఫ్రైడర్‌ ఎక్కువగా ఎఫ్‌టి ఎక్స్‌పై ఆధారపడి అపారంగా నష్టపోయానంటున్నారు. 2022లో ఈ సంస్థ 400 మిలియన్‌ డాలర్లు సేకరించగా అది 32 బిలియన్‌ డాలర్లకు విలువ పెరిగింది. సాఫ్ట్‌ బ్యాంక్‌, టెమాస్క్‌ టైగర్‌ గ్లోబల్‌, బ్లాక్‌రాక్‌, సిక్సియ లాంటి సంస్థల నుంచి పెట్టుబడులను సేకరించింది. గత రెండు సంవత్సరాలుగా నష్టపోయిన అనేక కంపెనీలు తిరిగి కోలుకోవడానికి సహాయపడినట్లు చెప్తోంది. తను 32బిలియన్‌ డాలర్లను నష్ట పోయినట్లుగా ఎఫ్‌టీఎక్స్‌ వెల్లడిరచింది. అతిపెద్ద వాణిజ్య వేదిక ఎఫ్‌టీటీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ బినాన్స్‌ ట్విటర్‌ ద్వారా తమన సంస్థ హోల్డింగ్స్‌ అన్నింటిని లిక్విడేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడంటే క్రిప్టో కరెన్సీకి ఏ గతి పట్టిందనేది సులువుగానే అర్థమవుతుంది. ఎఫ్‌టీఎక్స్‌ సీఈఓ శామ్‌ తన సొంత డబ్బు 17 బిలియన్‌ డాలర్లు కోల్పోయానని ప్రకటించారు.
క్రిప్టో కరెన్సీలోకి వచ్చిన సంస్థలు సెల్సియస్‌ నెట్‌వర్కు, త్రీయారోస్‌, ఓయగర్‌ కూడా గత ఏడాది బాగా లాభం పొందినప్పటికీ ఇటీవల కాలంలో వరుసగా దివాలా తీశాయి. ఇలాంటి సంస్థలను రకరకాల మార్గాలలో నమ్మించి మోసం చేసిన సంఘటనల్లో బహుశ ఇది ప్రపంచలోనే అతి భారీదిగా చెప్పవచ్చు. అతి పెద్ద పెట్టుబడిదారుడు వారెన్‌ బఫెట్‌ సైతం వీటిపట్ల ఆకర్షితుడుకావడం, నేడు ధనం మాత్రమే పరమావధిగా భావించి ఎండమావుల వెంట పరుగెడుతున్నారని భావించాలి. తాను కొనుగోలు చేసిన వాటాలను విక్రయించి మరెప్పుడూ పెట్టుబడి పెట్టబోనని ప్రకటించారంటే క్రిప్టో ప్రభావం సాధారణ కొనుగోలుదారులపైనేకాక బడా పెట్టుబడిదారులకు సైతం వణుకు పుట్టిస్తోంది. క్రిప్టో కరెన్సీలో ఇంత పెద్ద సంక్షోభానికి కారణం ఎఫ్‌టీఎక్స్‌దే బాధ్యత అని విశ్లేషిస్తున్నారు. ఈ రంగం అంతర్థానం గాకుండా తిరిగి పుంజుకోవడానికి కృషి చేస్తామని వివిధ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలు పెట్టుబడి పెట్టేవారిని నమ్మించి మోసగించడానికే కావచ్చు. వాణిజ్య బ్యాంకులలో కోట్లాది ప్రజలు తమ కష్టార్జితాన్ని దాచుకోగా బడాబాబులు రుణాలుగా తీసుకొని ఎగవేస్తున్న సంఘటనలను మనం చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్టుగా బ్యాంకుల్లో సొమ్మును బడాబాబులు అనుభవిస్తున్నారు. కార్పొరేట్‌ పారిశ్రామికవేత్తల మోసాలను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వాలు ఇలాంటి వ్యవహారాలలో జోక్యం చేసుకొని ప్రజలకు న్యాయం చేస్తాయనుకోవడం కష్టమే. 2017 మార్చిలో 5500 శాతం అపారంగా పెరిగిన బిట్‌కాయిన్‌ దాదాపు ఐదేళ్ల కాలంలో కుప్పకూలింది. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిపెట్టి అపార లాభాలు పొందాలనుకునే వారు నేటి సంక్షోభాన్ని హెచ్చరికగా తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వాలు విచ్చలవిడిగా కరెన్సీ నోట్లను ముద్రిస్తే అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించి సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్న సంస్థలకు ప్రింట్‌ చేసే అవకాశం ఉండదు. బ్లాక్‌చెయిన్‌ లెడ్జరు ద్వారా లావాదేవీలు జరుగుతాయి. ద్రవ్య వాణిజ్యం చేసే హెడ్జ్‌ఫండ్స్‌, బ్యాంకులు, బ్రోకర్లు తదితర అనేకమంది క్రిప్టోకరెన్సీవైపు ఆకర్షితులయ్యారు. స్టాక్‌మార్కెట్‌ సెన్సెక్స్‌ పెరగడం, తరగడం లాంటి వాణిజ్యం కాదని అర్థమవుతుంది. వేగంగా డబ్బు సంపాదించాలని తహతహలాడటం చాలా ప్రమాదకరం. లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టి క్రమంగా అభివృద్ధి చెందాలని యోచించేలోగా అప్పటికప్పుడు కోటీశ్వరులం కావాలనుకోవడం మంచి ఆలోచనకాదని మనకు క్రిప్టో తెలియజేస్తోంది. విలువపెరిగేవాటిలో, రియల్‌ఎస్టేట్‌ సంపద, అంతిమంగా ప్రయోజనం కల్పించే వాటిని ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలి. పాలకులు, యువత వేగంగా సంపాదనవైపు పరుగులు పెట్టించే విధానాలను విడనాడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img