Monday, September 26, 2022
Monday, September 26, 2022

డబ్బు సంచుల మాయ

పార్టీ ఫిరాయించడానికి కారణాలు ఏమైనా కావొచ్చు కానీ భగవంతుడు అనుమతిస్తే ఫిరాయింపుల అక్రమాలు కూడా సక్ర మాలై పోతాయి. గత మార్చిలో గోవా శాసన సభకు జరిగిన ఎన్ని కలకు ముందు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గుళ్లు, గోపురాలు, దర్గాలు, చర్చీలు తిప్పి పార్టీ ఫిరాయించబోమని వారి చేత ప్రమాణం చేయించింది. అయినా బుధవారం కాంగ్రెస్‌ నాయకుడు దిగంబర్‌ కామత్‌ నాయకత్వంలో ఎనిమిది మంది శాసన సభ్యులు భేషుగ్గా బీజేపీలో చేరిపోయారు. అంతకు ముందు పార్టీ ఫిరాయించబోమని దేవుడి ఎదుట చేసిన ప్రమా ణాలు ఏమైపోయాయని అమాయకంగా ప్రశ్నించే వారు ఉండొచ్చు. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఆ జటిల ప్రశ్నకూ సమాధానం దొరికి తీరుతుంది. బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున దిగంబర్‌ కామత్‌ వకాల్తా పుచ్చుకుని ‘‘మేం మళ్లీ దేవుడి దగ్గరకెళ్లి మోదీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందనీ ఆయనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విన్నవించాం. అప్పుడు దేవుడు మీకు తోచిన నిర్ణయం తీసుకోండి అని చెప్పారు’’ అంటున్నారు. ఈశ్వరుడి ఆజ్ఞ అయిన తరవాత ఇక ఫిరాయించడానికి అడ్డేమి ఉంటుంది. కామత్‌ నాయ కత్వంలో పార్టీ ఫిరాయించడానికి గత జులైలోనే ప్రయత్నం జరిగింది. కానీ బామాలో బతిమాలో కాంగ్రెస్‌ అప్పుడు ఫిరాయింపు ఆలోచన విరమించు కునేలా చేసింది. అప్పటికి సంక్షోభం తప్పినట్టే కని పించింది. ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బీజేపీలో చేరి పోవాలన్న సంకల్పం కలిగిన తరవాత దేవుడు ఆపలేదనుకోవాలి. పైగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ‘‘కాంగ్రెస్‌ ఛోడో బీజేపీ జోడో’’ అని లయబద్ధమైన నినాదం కూడా ఇస్తున్నారు. మోదీని బలోపేతం చేయ డానికే తాము బీజేపీలో చేరుతున్నామని మైఖేల్‌ లోబో అనే పెద్ద మనిషి కొత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకుడు అంటున్నారు. మోదీ పరిపాలనను ప్రపంచ మంతా కీర్తిస్తోందని కూడా సెలవిచ్చారు. ‘‘ఇవాళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమై పోయారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుంది. మోదీ నూతన భార తాన్ని నిర్మించడానికి గోవాను అభివృద్ధి చేస్తున్నారు. మాకు మద్దతు ఇవ్వ డానికే వారు బీజేపీలో చేరారు. ఇది గోవా అభివృద్ధికి చరిత్రాత్మకమైన నిర్ణయం’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రబోధ్‌ సామంత్‌ వెనకేసుకొచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ 20 సీట్లు సంపాదించింది. ఇంతకు ముందున్న సీట్లు, ఇప్పుడు జరిగిన ఫిరాయింపులతో బీజేపీ బలం 33కు పెరిగింది. ఎన్నికలు జరిగిన తరవాత మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఇం డిపెండెంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి దన్నుగా నిలబడ్డారు. జులైలో కాంగ్రెస్‌ నాయకులు ఫిరాయించ డానికి ప్రయత్నించినప్పుడు మైఖేల్‌ లోబో, దిగంబర్‌ కామత్‌ ఫిరాయింపు లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా అభ్యర్థించింది. ఇలాంటి సందర్భాలలో స్పీకర్‌ ఓ పట్టాన నిర్ణయం తీసుకోకపోవడం అత్యంత సహజంగా మారిపోయింది. ఎనిమిది మంది కాంగ్రెస్‌ నాయ కులు ఫిరాయించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో ముగ్గురే మిగిలారు. ప్రతిపక్షాలన్నింటికీ కలిపి ఏడుగురే మిగిలారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నిర్ణయం చాలా దుష్ట చింతనతో కూడుకున్నది అని గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధ్యక్షుడు విజై సర్దేశాయ్‌ అన్నారు. ‘‘ఈ ఎనిమిది మంది ఫిరాయించడం సకల రాజకీయ ఔచిత్యాలకు విరుద్ధం. కనీస మర్యాద, నిజాయితీ లేకపోయింది. డబ్బు సంచులకు ఆశపడి, అధికార దాహంతోనే వారు ఫిరాయించారు. ఇది వారి స్వార్థం, సిగ్గు మాలిన తనం. దేవుడి ఎదుట చేసిన ప్రతిజ్ఞను జవదాటడం’’ అంటున్నారాయన. ఇవన్నీ ఫిరాయింపుదార్ల ఎదుట వృథాగా పఠించే సూక్తి ముక్తావళిగా నిలిచి పోతాయి. ఇలా సూక్తి ముక్తావళి వినిపించే వారు ఉంటారని తెలుసు కనకే ఫిరాయింపుదార్లు దేవుడి ఆనతితోనే పార్టీ మారామని సమ ర్థించుకుంటున్నారు. ప్రజలు మద్దతు ఇచ్చినందువల్ల బీజేపీ అధికారంలోకి రాలేదు. మోసం, దగా కారణంగా ప్రజాస్వామ్యం అప హాస్యం పాల వుతోంది. వాస్తవం ఏమిటంటే ప్రజాప్రతినిధులు అంగడి సరుకైపోయారు. అలాం టప్పుడు డబ్బు సంచులతో తులతూగుతున్న బీజేపీ ఖరీదు కట్టి ఎమ్మెల్యేలను కొనకుండా ఎలా ఉంటుంది? అంగట్లో సరుకులు కొన్న దానికన్నా సునాయాసంగా బీజేపీ ఎమ్మెల్యేలను కొనేస్తోంది. దేశంలోని అతి పెద్ద పార్టీ, అత్యంత సంపన్నమైన పార్టీ కొనకుండా ఉంటుం దనుకోవడం భ్రమ. నీతి మాలిన ఈ ఫిరాయింపులు గోవాను సర్వ నాశనం చేస్తున్నాయని అంగలార్చేవారు ఉండొచ్చు. ఉంటారు. కానీ మోదీ పాలన మీద అపారమైన అనురక్తి పెంచుకుని, ఆయనను మరింత బలోపేతం చేయాలని భావించడమే కాకుండా దేవుడి అనుమతి కూడా తీసుకున్న తరవాత ఫిరాయింపుల గూర్చి వగచినందువల్ల ప్రయోజనం శూన్యం. పార్టీలు ఫిరా యిస్తున్న వారిని నమ్మి ప్రజలు ఓట్లేసి ఉండొచ్చు. లేదా తాము గెలిపించదలచుకున్న పార్టీ విధానాలో, కార్య క్రమాలు నచ్చో జనం ఓటు వేసి ఉండొచ్చు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయిన తరవాత తమ ప్రతినిధులను కట్టడి చేయడానికి ప్రజలకు హక్కు లేదుగా! పార్టీ ఫిరాయించే వారిని వెనక్కు పిలిపించే హక్కు మన ఎన్నికల వ్యవస్థ లోనే లేదు. ఒక్కసారి ఎన్నికైతే ఏ పార్టీ వారైనా సర్వస్వతం త్రులే. పైగా డబ్బు సంచులు అప్పనంగా వచ్చి పడ్తున్నప్పుడు కాదని కాలదన్నే అమాయకత్వం ప్రజా ప్రతినిధులకు ఉంటుం దనుకోవడం కుళ్లిన ఈ సమాజ ప్రస్థానంలో సాధ్యమయ్యే పనే కాదు. ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రమాణ పత్రాల మీద సంతకాలు చేశారు. పార్టీకి విశ్వాస పాత్రంగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే వారిమీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదా అని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్‌కు నమ్మకం ఉందో లేదో వేరే విషయం. డబ్బు సంచులు కనిపించిన తరవాత కూడా ప్రలోభాలకు లొంగకుండా ఉండడానికి దేవుడి మీద నమ్మకం ఉన్న ఈ ఎమ్మెల్యేలకు ఎలా సాధ్యం అవుతుంది. బీజేపీ దగ్గర కొనుగోలు శక్తి ఉన్న ప్పుడు అంగట్లో నిలబడే ప్రజా ప్రతినిధులను కొనకుండా ఉండడం సాధ్య మయ్యే పనేనా. చెలామణీలో ఉంటేనే డబ్బుకు విలువ. లేకపోతే అవి కేవలం కాగితం ముక్కలతో సమానం. భ్రష్ట రాజకీయాలను, ప్రత్యర్థి పార్టీల అభ్య ర్థులుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే కళలో బీజేపీ ఆరి తేరిపోయింది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ లక్ష్యం సాధించడానికి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ను ఓడిరచడం ఒక్కటే మార్గం అనుకుంటే లక్ష్య సిద్ధి అసాధ్యం అవుతుంది. అనుకున్నది సాధించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియో గించుకునే సమర్థత, సాహసం, తెంపరితనంలో బీజేపీని మించిన పార్టీ ఎక్కడుంది గనక!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img