Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిరుద్యోగుల అరణ్య రోదన

దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నదేగానీ తగ్గడం లేదు. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పోతున్నాయి. గడచిన 45 ఏళ్ల కాలంలో ఏనాడు లేనంతగా కోవిడ్‌`19 మహమ్మారి విజృంభించిన కాలంలో నిరుద్యోగం రేటు నమోదైంది. లాక్‌ డౌన్‌ సమయంలో గ్రామాల నుండి వలస వెళ్లిన లక్షలాది మంది కూలీలు స్వస్థలాలకు చేరుకోవడానికి వందల మైళ్లు నడిచి ఎనలేని కష్టాలు పడ్డారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత ఉపాధి లేక జీవనం దుర్భరంగా మారినప్పుడు కేంద్ర ప్రభుత్వం మౌన ప్రేక్షకుడి పాత్ర వహించిన విషయం దేశ ప్రజలకు తెలుసు. ఇక పట్టణాలు, నగరాలలో చిన్న, పెద్ద పరిశ్రమలు లక్షలు మూతపడి నిరుద్యోగం ఒక్కసారి గరిష్ఠ స్థాయికి చేరింది. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో పారిశ్రామిక కార్య కలాపాలు జరగలేదు. ఇప్పటికీ వేలాది సూక్ష్మ, చిన్న పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. తెరిచిన పరిశ్రమల్లోనూ పూర్తి స్థాయిలో ఉద్యోగులను, కార్మికులను తిరిగి తీసుకోలేదు. ఉపాధి, ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనాలను తగ్గించి ఇస్తున్నారు. వ్యవసాయ రంగం ఎక్కవ మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ రంగాన్ని సైతం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకు వచ్చింది. సర్వ రంగాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వారిపరం చేయాలని చూసింది. అయితే రైతాంగం సకాలంలో మేల్కొని ఏడాదికి పైగా మహత్తర పోరాటం చేయడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న యోచనతో దేనికీ స్పందించని ప్రధాని చట్టాలను ఉపసంహరించున్నారే గానీ ఆనాడు రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఇప్పటికీ ఏదో రూపంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తూనే ఉంది. ఇచ్చిన హామీలను ఉల్లంఘించడంలో మోదీ తర్వాతనే మరెవరైనా అన్నది అతిశయోక్తి కాదు.
గత ఏడాది కోవిడ్‌ మహమ్మారికి ముందున్న ఉద్యోగ మార్కెట్‌ మళ్లీ ఆ స్థాయికి తిరిగి చేరుకోలేదు. ముఖ్యంగా పట్టణాల్లో 2022లో నిరుద్యోగుల శాతం 9.57 శాతానికి చేరుకున్నది. ఉపాధి ఉద్యోగుల అవకాశాలు తగ్గిపోయిన కాలంలో నిరుద్యోగుల పరిస్థితులు దారుణంగా ఉంటాయి. సెప్టెంబరులో నిరుద్యోగులు 7.7 శాతానికి తగ్గినట్టు అంచనాలున్నప్పటికీ జాబ్‌ మార్కెట్‌ కార్యకలాపాలు గణ నీయంగా పుంజుకోలేదు. ఇక పండగ సీజన్‌లలో సైతం జాబ్‌ మార్కెట్‌ పరిస్థితి మెరుగుపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో పంటలు వేసే సీజన్‌లో కార్యకలాపాలు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల శాతం ఆగస్టులో 7.68 శాతం ఉండగా, సెప్టెంబరులో 5.84 శాతానికి తగ్గింది. వ్యవసాయ కార్యకలాపాలు పెరగడం వల్ల నిరుద్యోగుల శాతం తగ్గినప్పటికీ తక్కువ వేతనాలకు, కూలీకి పని చేయవలసి రావడం వల్ల వీరి ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. వచ్చే ఆదాయం పెరగకపోగా మోదీ పాలనలో గత ఎనిమిదేళ్ల కాలంలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు, వివిధ రకాల సేవల రేట్లు అపారంగా పెరిగాయి. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితుల, కుటుంబ సభ్యుల సంఖ్యను అనుసరించి కనీసం ఐదు నుంచి పదివేల రూపాయల అదనపు ఖర్చు భారం పడిరది. ఈ పరిస్థితిని తిరస్కరించే మంత్రులు, ఉన్నతాధికార వర్గం క్షేత్ర స్థాయిలో ప్రజల జీవన పరిస్థితులను పరిశీలించడం ఉండదు. నిరుద్యోగులు దీర్ఘకాలం విసిగి వేసారిపోయి ఏదో దొరికిన పని చేసుకుంటూ పొట్ట పోసుకునే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఏ పనీ లేనివారి ఆలోచనలు పక్క దారి పట్టి అసాంఘిక చర్యలకు పూనుకుంటు న్నారు. ఫలితంగా సమాజం తీవ్ర అలజడికి గురవుతుంది. మోదీ ప్రధాని అయ్యేముందు ఎన్నికల ప్రచారంలో ఏటా కోటి ఉద్యోగాలు సృష్టిస్తానని చేసిన వాగ్దానం గంగలో కలిసిపోయింది.
నిరుద్యోగాన్ని భరించలేక వందలు, వేల మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశంలో పారిశ్రామిక ఇతర ఉత్పత్తి రంగాలను విస్తరించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి బదులుగా నిరుద్యోగుల జీవితాలను మరింత దుర్బరం చేస్తూ మోదీ కార్పొరేట్లు, సంపన్నుల అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. పైగా యువత దేశ భవిష్యత్‌కు ఆశాజ్యోతి అని, వారిని ఆకట్టుకొనే కొత్తకొత్త నినా దాలిస్తూ కాలం గడుపుతున్నారు మోదీ. నిరుద్యోగుల శాతం తీవ్ర ఎగుడు దిగుడులకు లోనవుతోందని సర్వేలు తెలియజేస్తున్నాయి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పుడు కుటుంబాల ఆదాయాలు తగ్గిపోయి కొనుగోలు శక్తి పడి పోతుంది. మార్కెట్‌లోకి వస్తువుల డిమాండ్‌ పడిపోతుంది. అప్పుడు ఉత్ప త్తులు తప్పనిసరిగా తగ్గిపోతాయి. ఫలితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఎన్నికల సమయంలో యువతను ఊరించే గిమ్మిక్కులు చేయడంలో మోదీ ‘ప్రావీణ్యత’ సంపాదిం చారు. ఇప్పటికైనా యువత, నిరుద్యోగుల ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా స్పందించకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img