Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

నీరసంగానే ఉత్పత్తి రంగం

ఆర్థిక రంగం దిగజారిపోయిందని 202223 ఆర్థిక సర్వే స్పష్టం చేసినప్పటికీ మన ఆర్థికమంత్రి మాత్రం ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందంటారు. పారిశ్రామికరంగంలో పెట్టు బడులూ పెరగడంలేదని అందువల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగడంలేదని సర్వేలు చెబుతున్నాయి. ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడానికి 202324 బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశామని, అన్ని రంగాలు పుంజుకుంటాయని గొప్పలు చెప్పారు. అయితే బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉత్పత్తిరంగం ఎంతమాత్రం పెరుగుదలను కనబరచడంలేదు. బడ్జెట్‌ ప్రతిపాదనలు విఫలమయ్యాయని అర్థికరంగం విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థిక బడ్జెట్‌ కేవలం ఆదాయ, వ్యయాల లెక్కల పత్రమేకాదు స్వల్పకాలిక ఆర్థిక విధానం కూడా. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మధ్యతరగతి ప్రజలకు పన్ను రాయితీలను ఇవ్వడం ఓట్లను రాబట్టుకునే ఎత్తుగడ మాత్రమే. అత్యంత కీలకమైన వ్యవసాయరంగానికి కేటాయింపులు నేటి ద్రవ్యోల్బణం, అధిక ధరల కారణంగా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ప్రతిపాదనలు చాలా గొప్పగా ఉన్నాయని పొగిడిన వారూ లేకపోలేదు. బడ్జెట్‌ అంతా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారన్న విషయంలో సందేహంలేదు. ఉత్పత్తిరంగం పెరిగితేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగం ఇంకా పెరిగినట్లయితే ఆదాయాలు లేక కొనుగోలు శక్తి తగ్గి పన్ను ద్వారా ప్రభుత్వానికి లభించే ఆదాయం తగ్గుతుంది. అధిక ధరలవల్ల నిజ ఆదాయం పడిపోతుంది. ఈ పరిణామాలన్నీ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు. ఉత్పత్తిరంగాన్ని విస్తరించి అధిక ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ఇస్తున్న నినాదం అలాగే మిగిలిపోతుంది. కొవిడ్‌19 మహమ్మారి దేశంలో ప్రవేశించి విజృంభించిననాటి నుంచి ఉత్పత్తి రంగం, ఉపాధి, ఉద్యోగ, కల్పనరంగాలు మాంద్యంలోనే కొనసాగుతున్నాయి. అయితే కరోనా కాలంలోనూ వ్యవసాయరంగం వృద్ధి కొనసాగుతూ, మంచి ఆదాయం పొందింది. అయితే ఉత్పత్తిరంగంలో వృద్ధి నిరాశా జనకంగాఉంది. నిరుద్యోగం మరింత పెరిగింది. 202122లో ఉత్పత్తి 9.9శాతం నమోదుకాగా 202223లో కేవలం 1.6శాతానికి దిగ జారింది. నిరుద్యోగం 2022 డిసెంబరు నాటికి అత్యధికంగా 8శాతానికి చేరింది. మనదేశం వృద్ధి సాధనకు ప్రధానంగా సర్వీసు రంగంపైన ఆధారపడుతోంది. వృద్ధికి సంబంధించిన విభాగాలలో ఉత్పత్తి రంగం అత్యంత దిగువన ఉంది. అదే సమయంలో జీడీపీలో ఉత్పత్తి విభాగం అట్టడుగున ఉందని తెలుస్తూనే ఉంది. ఉత్పత్తిరంగం గణనీయంగా దిగజారినందున వృద్ధిరేటు 7శాతం ఉండవచ్చునని అంచనా. ప్రస్తుతం ఒకవైపు యుద్ధం, మరోవైపు కరోనా కారణంగా ఉత్పత్తులు, సరఫరాలు తగ్గుతున్న దశలో 7శాతం వృద్ధికూడా సాధ్యమేనా అన్న సందేహాలున్నాయి. 202122లో ఉత్పత్తి రంగం బాగా తగ్గినప్పటికీ జీడీపీ వృద్ధి 8.7శాతంగా నమోదైంది. ప్రస్తుతం జీడీపీ వృద్ధి 7శాతంపై సందేహాలుండటం సహజమే. ఉత్పత్తి రంగం వాటా జీడీపీలో కేవలం 17శాతమే. జీడీపీలో ఉత్పత్తి రంగం 2022లో 16`17శాతం కాగా అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మేక్‌ఇన్‌ ఇండియా పథకం ప్రవేశపెట్టిన తర్వాత పెరుగుదల అత్యంత అల్పంగానే ఉంది. దాదాపు దశాబ్దికాలంగా ఉత్పత్తిరంగం విస్తరిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. సరళతర వాణిజ్యం, రాష్ట్రస్థాయిలో భూ సంస్కరణలు, ఆధునిక డిజటలీకరణ లాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఉత్పత్తి రంగం గణనీయంగా పెరగకపోవడం పాలకుల విధానాలు లోపభూయిష్టంగా ఉండటమే. ఆర్థికరంగాన్ని తీవ్రంగా ప్రతికూల ప్రభావానికిలోను చేస్తున్నది నిరుద్యోగమే. కోవిడ్‌ 19 తర్వాత జీడీపీ కోలుకున్న తర్వాత నిరుద్యోగం మాత్రం పెరుగుతూనే ఉంది. 2020లో ఉత్పత్తిరంగాన్ని ఉత్తేజపరిచేందుకు బడ్జెట్‌లో భారీగా ప్రోత్సాహకాలు ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రకటించారు. ఉత్పత్తితో అనుసంధానించి రుణాలను ఎక్కువగానే ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమలను విస్తరించేందుకు విక్రయాల ఆధారంగా నేరుగా ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఉత్పత్తితో అనుసంధానించి రుణాలను ఎక్కువగానే ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమలను విస్తరించేందుకు విక్రయాల ఆధారంగా నేరుగా ప్రోత్సాహకాలను ప్రకటించారు. ప్రధానంగా ఉత్పత్తులను భారీగా పెంచగలిగేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చారు. ప్రపంచ దేశాలకు సరఫరాలు పెంచే కేంద్రంగా తయారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. విధానపరమైన ప్రోత్సాహకాలను తీసుకుని ఉత్పత్తులు పెంచేందుకు ప్రయత్నించారు. అయితే రుణాలిచ్చే విషయంలో తేడా ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకిచ్చే రుణాలు అతి స్వల్పంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఆధిక ఉత్పత్తులు సాధించగల దాదాపు 11లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలుగు తున్న సూక్ష్మ పరిశ్రమలకు అతి తక్కువ రుణాలిచ్చారు. దీంతో ఉత్పత్తిరంగం వేగంగా పెరగలేదు. ఉత్పత్తితో సంధానించిన రుణాల పథకంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. అలాగే దేశ లాజిస్టిక్స్‌ (సదు పాయాల కల్పన) రంగం చాలా అధ్వాన్నస్థితిలో ఉంది. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధిపరచేందుకు లాజిస్టిక్స్‌ అత్యంత కీలకమైంది. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి పరచేందుకు లాజిస్టిక్స్‌పై అత్యంత శ్రద్ధపెట్టాలి. ఉత్పత్తిరంగాన్ని పూర్తిగా పునరుజ్జీవింపచేయడం ద్వారా ఉద్యోగా వకాశాలు, దేశంలో డిమాండ్‌ అధికం చేయడానికి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేయడంతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img