Monday, August 8, 2022
Monday, August 8, 2022

పొంచి ఉన్న ఆహార కొరత

రోజురోజుకీ అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరు గుతూ జీవన వ్యయాన్ని అధికం చేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఉన్న కుటుంబ జీవన వ్యయం ఆయా కుటుంబాల అవసరాల ననుస రించి నేడు కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు పెరిగింది. ఫలితంగా కోట్లాది మంది నిత్య జీవనం దుర్బరంగా మారిందే గాని మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలోనే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయ పతనం లాంటి ప్రజలను పట్టి పీడిస్తున్న అంశాలపై చర్చించ డానికి కూడా మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్ధితికి తోడు దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. అమృతోత్సవాలు జరుపుకుంటున్న పాలకులకు ఇలాంటి వన్నీ స్వల్ప విషయాలుగా అనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని వణికించిన, కోటా ్లది మంది ప్రాణాలు హరించిన కోవిడ్‌`19 మహమ్మారి, యుద్ధం, ఈ ఏడాది తగ్గిన వర్షాలు, పెరిగిన భూతాపం లాంటి అనేక కారణాల వల్ల వరి సాగు తగ్గుతుందని, ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతుం దని తాజాగా వెలువడిన గణాంకాల సారాంశం. ఉత్పత్తి తగ్గితే వస్తువుల ధరలు మార్కెట్‌లో మరింతగా పెరుగుతాయి. వర్షాల కొరత వల్ల వరి సాగు 13 శాతం తగ్గింది. కొరతను పరిగణ లోకి తీసుకొనే గోధుమ ఎగుమతిపై నిషేధం విధించారు. ఉత్పత్తి తగ్గినప్పుడు సేకరణ లక్ష్యం నెరవేరదు. ఉత్పత్తి ఖర్చుకు, రైతు పొందే ఆదాయానికి తీవ్రమైన తేడా ఉండటం వల్లనే అప్పుల పాలైన రైతులు వేలాది మంది ప్రతి ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీద జరిగే వరి ధాన్యం ఉత్పత్తిలో పావు వంతు పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాలు బాగా తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే బియ్యం వాణిజ్యంలో 40 శాతం భారతదేశం వాటా ఉంది. వీటి ఉత్పత్తి తగ్గితే ఎగుమతి తగ్గుతుంది. అప్పుడు విదేశీ మారక ద్రవ్యం నిల్వల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ధరలు పెరుగుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తనున్నదని వ్యవ సాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంచుకొస్తున్న వాతా వరణ సంక్లిష్టతలు ప్రజల అన్ని జీవన రంగాలను అతలాకుతలం చేస్తోంది. ఈ అంశాన్ని దీర్ఘకాలంగా పట్టించుకోక పోవడం వల్లనే ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, కొన్ని చోట్ల అధిక వర్షాలు, కోవిడ్‌ లాంటి అత్యంత ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయి. మన దేశంలో గోధుమ, వరి ధాన్యం ఉత్పత్తి తగ్గితే, అత్యధికంగా మనం చేస్తున్న ఎగుమతులు తగ్గి అంతర్జాతీయంగా ఆహార ధాన్యాల కొరతకు దారి తీస్తుంది. ఈ ఏడాది మే 13 నుంచి గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత మే 14 నుంచి సేకరణ కోటి 80 లక్షల టన్నులు జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో సేకరణ మూడు కోట్ల 60 లక్షల టన్నులకు పైగా సేకరించగలిగారు. సేకరణ 53 శాతం అంటే 182 లక్షల టన్నులు తగ్గింది. మే నెల నాటికి గోధుమ సేకరణ సైతం 4.41 శాతం తగ్గింది. బియ్యం వినియోగం పెరుగుతున్న సమయంలోనే ఉత్పత్తి తగ్గడం ఆందోళన కలిగించే విషయం. కొన్ని రకాల బియ్యం ధరలు ఇప్పటికే పది శాతం పెరిగాయి. ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం ఉన్నట్లయితే గోధుమ, వరి ఉత్పత్తులు పెరగ వచ్చు. అయితే ఏ మేరకు పెరుగుతాయనేది ఇప్పుడే అంచనా వేయలేం. ఈ పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరి గింది. ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి తగ్గించాలన్నది తమ లక్ష్యమని ప్రభుత్వం చెప్తోంది. అయితే తగ్గించడానికి తీసుకోబోయే చర్య లను వెల్లడిరచరు. ఎందుకంటే ధరలు, ద్రవ్యోల్బణం తగ్గించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం వద్ద కనిపించదు. స్వాతంత్య్ర పోరాట చరిత్రే లేని పాలకులు తిరంగ కార్యక్రమం చేపట్టటం, అమృతోత్స వాల నిర్వహణ, పాలక బిజెపి విస్తరణ, మరిన్ని రాష్ట్రాల్లో తమకు మెజారిటీ ఉన్నా లేకపోయినా అక్రమ మార్గాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో తల మునకలై ఉన్నారు.
నేడు సామాన్యుల దుస్థితిని తెలియజేసే ఆసక్తికరమైన సంఘ టన రాజ్యసభలో చోటు చేసుకున్నది. దిల్లీలో నివసించే నలుగురు సభ్యులు గల కుటుంబ యజమాని నెలకు రూ.12 వేలు సంపా దిస్తున్నాడు. ఇంటి అద్దె రూ.4 వేలు, పిల్లల స్కూలు ఫీజు రూ.2 వేలు, రూ.1200 వంట గ్యాస్‌, వైద్యం ఖర్చులు కొన్ని వేలు, ఆహారానికి రూ.3 నుంచి రూ.4వేలు అవుతుంది. అంటే నెలసరి వచ్చే ఆదాయం కుటుంబ జీవనానికి సరి పోతుందా? ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవించే వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దేశ ప్రజలు ఏమాత్రం సంతృప్తికర జీవనం సాగించ లేనప్పుడు తమకు కావలసిన రీతిలో వృద్ధి గణంకాలను వెల్లడిర చినా ఉపయోగం ఉండదు. పాలకుల ఉత్సవాలను నిత్య జీవనా నికి సతమతమయ్యే జనం పట్టించుకోరు. వంది మాగద మీడియా ప్రభుత్వం గొప్పలు చెబితే ప్రజలు నమ్మరు. ఒకవైపు గతంలో ఏనాడు లేనంతగా నిరు ద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి సరైన ఆదాయం లేక సతమతమవుతున్న వారికి కనీసం ఆహార భద్రత కల్పించడానికి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలను తీసుకోవాలి. ప్రజలు స్వయం సమృద్ధి పొందాలి. దేశం స్వయం సమృద్ధి పొందుతుందని, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ అంటూ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, కొత్త కొత్త ఆకర్షణీయమైన నినాదా లిచ్చినా ప్రయోజనం ఉండదు. పౌష్టికాహార లోపంతో ఈసురో మంటూ జీవిస్తున్న మహిళలు, పిల్లలు మరిన్ని బాధలకు గురవక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img