కుక్కలకు విశ్వాసపాత్రంగా ఉండడంతో పాటు దొంగల్ని పట్టుకునే లక్షణం కూడా ఉందంటారు. మోదీ సర్కారు ఏలు బడిలో సీబీఐ, ఆదయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొ రేటు లాంటి కేంద్ర సంస్థలకు కూడా అవినీతి పరులు ప్రతి పక్షంలోనే కనిపిస్తారు. అవినీతిని ఇసుమంత కూడా సహించబోం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవకాశం వచ్చి నప్పుడల్లా చెప్తూనే ఉంటారు. అవినీతిపరులను వేటాడడంలో ఆయన ప్రభుత్వం వెనుకాడదు. కానీ ప్రతిపక్షాలలోని అవినీతి పరులను మాత్రమే వేటాడి వేధి స్తారు. సీబీఐకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్‌కు బీజేపీ నాయకుల్లో ఒక్క అవినీతిపరుడూ కనిపించడు. అధికారం అందే దాకా బీజేపీ విలక్షణ మైన పార్టీగానే ఉండేదన్నది నిజం. కానీ బీజేపీకి అధికారం అందిన తర వాత ఆ పార్టీ నాయకులూ అవి నితిలో తక్కువేమీ కాదని తేలిపోయింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పే దీనికి నిదర్శనం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ దశలో కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్న రోజులు ఉన్నాయి. కానీ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొ ంట్ ఆయన వేపు కన్నెత్తి కూడా చూడలేదు. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను అనుసరిస్తుం దని కూడా మోదీ మొదలైనవారు అవ కాశం దొరికినప్పుడల్లా దెప్పి పొడు స్తుంటారు. కానీ యడియూరప్ప రాజ కీయాల్లో తన కుమారుడిని ప్రోత్సహిం చడం బీజేపీ అగ్ర నాయకులకు కనిపించదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఇటీవల బీజేపీ చేతిలో ఒక పదునైన ఆయుధంగా మారింది. తాజాగా ఆ అయుధం వేటుకు గురైంది శివసేన నాయకుడు రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఇదివరకే ఆయన భార్య ఆస్తులను జప్తు చేశారు. ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ కత్తి పడబోతోందని అందరికీ తెలిసిందే. రౌత్ భార్య ఆస్తులు జప్తు చేసినప్పుడు నేషనలిస్టు కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ గత ఏప్రిల్‌లో ప్రధానమంత్రి మోదీతో సమావేశం అయినప్పుడు ఈ విషయం ప్రస్తావించారు కూడా. తీరా సంజయ్ రౌత్నే ఆదివారం అరెస్టు చేస్తే, పొద్దంతా ఆయనను ప్రశ్నిస్తే మాత్రం శరద్ పవార్ పెదవి మెదప లేదు. సంజయ్ రౌత్ శివసేనలో ఉన్నా శరద్ పవార్ మనిషి కిందే లెక్క. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు కూడా. ప్రత్యర్థులను రాజ కీయంగా ఎదుర్కోవడం, ఏదో ఓ రకంగా ప్రలోభ పెట్టి ప్రతిపక్ష నాయ కులను లొంగదీసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు మోదీ సర్కారు తన చేతిలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి మీదైతే గురి పెడ్తుందో వాళ్ల ఇళ్లల్లో సోదాలు జరుగుతాయి. కట్టలు కట్టలు డబ్బు దొరుకుతుంది. కిలోల కొద్దీ బంగారం బయటపడ్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడానికి బీజేపీ చాలా పాట్లు పడ్డా ఫలితం దక్కలేదు. ఆమె దగ్గరి బంధువు అభిషేక్ బెనర్జీ, తాజాగా పార్థా చటర్జీ మీద ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్ దాడులు చేసింది. 2021లో బెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, మమత బంధువులు కలిసి 14 మంది మీద ఇలాగే దాడులు జరిగాయి. అదే సంవత్సరం తమిళనాడు శాసన సభ ఎన్నికల నేపథ్యంలో డి.ఎం.కె. నాయకుడు ఎం.కె.స్టాలిన్, ఆయన కుమారుడు, కోడలి మీద సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఇలాంటి దాడులే జరిగాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సహా 2014 నుంచి ఇప్పటి వరకు 609 మంది రాజకీయ ప్రత్యర్థుల మీద దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి. ఇందులో బీజేపీ ప్రత్యర్థుల కుటుంబాలకు చెందిన వారు, ప్రభుత్వాన్ని విమర్శించే వారూ ఉన్నారు. ఈ జాబితా అంతా వెతికితే 39 మంది మాత్రమే బీజేపీకి చెందిన వారు కనిపిస్తారు. యు.పి.ఎ. అధి కారంలో ఉన్నప్పుడూ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయ లేదని కాదు. కానీ మోదీ హయాంలో అది 340 శాతం పెరిగింది. అప్పుడు అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చింది బీజేపీని వ్యతిరేకించే వారి మీదే కనక బీజేపీ నాయకులను వేధించడానికి యు.పి.ఎ. ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పడానికి వీలు లేదు. 2022లో అయిదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలకు ముందు సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మీద దాడులు జరిగాయి.
అవినీతిని బొత్తిగా సహించని బీజేపీ 2019లో అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, ఆయన భార్య, కొడుకు, సోదరి మీదా దాడులు చేయించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా మోదీతో సహా బీజేపీ నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ అగ్ర నాయకులకు అనుకూలంగా మాట్లాడని ఎన్నికల కమిషనర్ లవాసా ఒక్కడే. ఆయన మీద దాడులకు ఇదీ కారణం అయి ఉండొచ్చు. ఆ తరవాత లవాసా రాజీనామా చేసి దేశమే వదిలి మనీలాలో ఏషియన్ డెవలప్మెంటు బ్యాంకులో చేరిపోయారు. దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు చాలా విచక్షణతో వాడుతుంది. తమ వారి మీద అస్సలు వాడదు. 2019లో కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగే నాటికే బి.ఎస్. యడియూరప్ప మీద బోలెడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నాయకులకు, జడ్జీలకు, న్యాయవాదులకు భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పినట్టు రాసి ఉన్న డైరీలు కూడా దొరికాయి. యడియూరప్ప మీద నేర విచారణను నిలిపివేయడానికి కర్నాటక హైకోర్టు నిరాకరించింది. కానీ ఇటీవలే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వు మీద స్టే విధించింది. యడియూ రప్ప మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ పట్టించుకోలేదు.
శారద చిట్ ఫండ్ కుంభకోణలో సంబంధం ఉందన్న కారణంగా 2014 సెప్టెంబర్‌లో తృణమూల్ నాయకుడు సువేందు అధికారి మీద బీజేపీ అధికారంలోకి వచ్చాకే దాడులు జరిగాయి. 2017లో ఎన్ఫోర్స్ మెంట్ దాడి కూడా జరిగింది. కానీ సువేందు అధికారి 2020లో బీజే పీలో చేరారు. అప్పటి నుంచి ఆయన మీద విచారణ ఊసే లేదు. ఆయనే ఇప్పుడు బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు. అసోంలో హిమంత బిశ్వ శర్మది ఇదే పరిస్థితి. నీటి సరఫరా కుంభకోణంలో ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయన బీజేపీలో చేరిన తరవాత బీజేపీ చేసిన గొడ వంతా చల్లబడిరది. అదే హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు అసోంలో బీజేపీ ముఖ్యమంత్రి. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు. ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల అవినీతి కొత్త కాదు. అవినీతి ప్రజాస్వామ్య లక్షణం సంతరించుకుంది. బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతిని అస్సలు సహించదు. ఎంతటి అవినీతిపరులైనా బీజేపీలో చేరితే గంగా స్నానం చేసినట్టే. అందరికీ ఆ అవకాశం ఉండకపోవడమే సమస్య.