London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

మోదీ శుష్క శాంతి మంత్రాలు

ఆర్థిక, సైనిక ప్రయోజనాలు లేకుండా ఏ యుద్ధమూ జరగదు అన్నది వాస్తవం. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఇవే ప్రధానాంశాలు. వీటిని పట్టించుకోకుండా ఆరు వారాల కిందట రష్యా అధినేత పుతిన్‌ తో, శుక్రవారం ఉక్రెయిన్‌ అధిపతి జెలిన్‌ స్కీతో చర్చలు జరిపినప్పుడు ప్రధానమంత్రి మోదీ వల్లించే శాంతి వచనాలవల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా ఉక్రేెయిన్‌ లో తొమ్మిది గంటలపాటు ఉన్న మోదీ ఇటీవల రష్యా అధినేతతో ఇవే మాటలు చెప్పిన దాఖలాలు లేవు. ‘‘ఈ యుద్ధంలో మేం తటస్థంగా లేం, శాంతి కావాలంటున్నాం’’ అన్న మోదీ ప్రకటనలో డొల్లతనమే ఎక్కువ. యుద్ధం చేసేవారు కూడా నిజానికి యుద్ధం కోరుకోరు. ఎందుకంటే యుద్ధంలో విజేతలు, పరాజితులు ఉన్నారని అనుకోవచ్చు. కాని అది కేవలం భ్రమే. ఆర్థికంగా, సైనికంగా రెండు పక్షాలూ అపారంగా నష్టపోతాయి. కానీ ఈ రెండు ప్రయోజనాలు సాధించడానికే యుద్ధాలకు దిగవలసి వస్తుంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఎందుకు వచ్చిందో మోదీ ఆలోచించినట్టు లేదు. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరాలనుకుంది. ఈ వాస్తవాన్ని మోదీ వాటంగా విస్మరిస్తున్నారు. ‘‘ఇండియా చాలా గొప్ప దేశమే కాక పెద్ద దేశం. పలుకుబడి ఉన్న దేశం కూడా’’ అని జెలిన్‌ స్కీ ముఖస్తుతి మాటలు చెప్పి ఉండొచ్చు. భారత్‌ లో పర్యటించాలని మోదీ ఆహ్వానిస్తే జెలిన్‌ స్కీ ఎగిరి గంతేశారు. ఆ పర్యటన ఎంత త్వరగా సాధ్యమైతే అంత మంచిది అన్నారు. కానీ తమ దేశంలో పరిస్థితి చక్కబడాలి కదా అనడం ద్వారా ఇప్పట్లో జెలిన్‌ స్కీ భారత పర్యటన సాధ్యమయ్యేది కాదని తేలిపోతోంది. మోదీ-జెలిన్‌ స్కీ సంభాషణల తరవాత సంయుక్త ప్రకటన విడుదల చేసిన మాట వాస్తవమే కానీ అందులో మహత్తరమైన అంశాలు ఏమీ లేవు. ఉక్రేెయిన్‌ వెళ్లక ముందు మోదీ అనేక మాటలు చెప్పారు. చర్చలు ముగిసిన తరవాత అతిశయోక్తులు గుమ్మరించారు. సంప్రదింపుల ద్వారా రెండు దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పడం రొడ్డకొట్టుడు హితోక్తికే పరిమితం. ఉక్రేెయిన్‌ మీద దాడి మొదలు పెట్టినప్పుడు, ఉక్రెయిన్‌ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు రష్యాకు ఉన్న కారణాలు రష్యాకు ఉన్నాయి. వాటిని నిరాకరించడం కుదరదు. మోదీ రష్యాను ఖండిరచగలరని ఆశించలేం. గత రెండేళ్లుగా ఆ పని చేయనూలేదు. ఉక్రెయిన్‌ లో మోదీ శాంతి వచనాలు పలకడంతోపాటు జెలిన్‌ స్కీని కౌగలిచుకోవడం లాంటివి మామూలు దౌత్య విధానాల్లో భాగమే. యుద్ధంలో అమరణించిన బాలల స్మారక చిహ్నం వద్ద మౌనం పాటించడం కూడా అంతే. మోదీ ఉక్రెయిన్‌ పర్యటనను పశ్చిమ దేశాలు హర్షించవచ్చు. 1991లో ఉక్రెయిన్‌ స్వతంత్రదేశంగా అవతరించిన తరవాత ఆ దేశంలో పర్యటించిన మొదటి భారత ప్రధాని మోదీయే కావడం కూడా దస్తావేజుల్లో చేర్చడానికి మాత్రమే ఉపకరించే వివరం. మోదీ పోలెండ్‌ పర్యటనకన్నా ఉక్రెయిన్‌ పర్యటనకే పశ్చిమదేశాల మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. కానీ రష్యాతో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలను అంతర్జాతీయ మీడియా ఈ సందర్భంగా గుర్తు చేయకపోలేదు. రష్యాతో మనకున్న సంబంధాలు సుదీర్ఘమైనవే కాక కాలపరీక్షకు నిలిచినవి. మనం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అందులో కొత భాగం లోపాయికారీగా యూరప్‌ దేశాలకు తరలిస్తున్నాం. ఈ రహస్యం ఎవరికీ తెలియందీ కాదు. మన జాతీయ పోరాటాన్ని సమర్థించడం దగ్గర నుంచి పాకిస్తాన్‌ అప్పటి తూర్పు పాకిస్తాన్‌ మీద దాష్టీకం కొనసాగించినప్పుడూ రష్యా మనకు అండగా నిలబడిరచి. మనం బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇచ్చినప్పుడు సప్తమ నౌకాదళాన్ని పంపిస్తాం అని అమెరికా బెదిరించినప్పుడు మనకు అండగా నిలిచింది రష్యానే. రష్యాతో చర్చలు జరపడానికి ఉక్రెయిన్‌ ఒక శాంతి ఒప్పందం ప్రతిపాదన చేసినప్పుడు మనం ఆ సన్నాహాలకు ఒక ప్రతినిధిని పంపాం. కానీ ఆ సదస్సులో పాల్గొనలేదు. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్యాతో ఉన్న సంబంధాలను మనం అమాంతం తుంచేసుకోవడం కుదరని పని. మోదీ ఉక్రెయిన్‌ అధినేతతో చర్చలు జరిపినప్పుడు యుద్ధ కారణాన్ని చర్చించిన జాడలూ లేవు.
నాటో కూటమిలో చేరాలన్న ఉక్రెయిన్‌ ఆలోచననూ మోదీ ప్రస్తావించినట్టు లేదు. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరడాన్ని రష్యా సమర్థించక పోవడానికి కారణం ఉంది. తమ దేశం చుట్టూ నాటొ బలగాలను అమైరికా మోహరిస్తూ ఉంటే రష్యా చూస్తూ కూర్చుంటుందనుకోలేం. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండు కోట్లమందిని పోగొట్టుకున్న త్యాగమయ కీర్తి రష్యాకు ఉంది. యుద్ధం అంటే ఏమిటో రష్యాకు ఎవరూ సుద్దులు పలకాల్సిన పనిలేదు. అమెరికా ఎప్పుడూ వివిధ దేశాల మధ్య తంపులు పెట్టి ఆయుధ వ్యాపారమే చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో శాంతి నెలకొంటే అమెరికా ఆయుధ కర్మాగారాలు, ప్రధానంగా ప్రైవేటు రంగంలోని ఆయుధ పరిశ్రమలు మూత పడాల్సిందే. ఆర్థికంగా అంత నష్ట పోవడానికి అమెరికా ఎటూ ఇష్టపడదు. కానీ ఉక్రెయిన్‌ నాటో బలగాలను అనుమతించినా, లేదా నాటో కూటమిలో చేరినా రష్యా భరిస్తుందనుకోవడం కల్ల. తాను గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ దేశం నుంచి వచ్చాను కాబట్టే శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాం అన్న మోదీ మాటలు వినసొంపుగానే ఉండొచ్చు. శాంతి వచనాలు ఎవరికైనా బాగానే ఉంటాయి. చైనా కన్నా మనం రష్యా నుంచి ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటున్నాం అన్న వాస్తవాన్ని మోదీ నిరాకరించలేరుగా! పశ్చిమ దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించినప్పుడు మన చమురు దిగుమతులే రష్యా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగంగా ఉన్నాయి. తూర్పు యూరప్‌లో నాటో బలగాలు మోహరించారు. నాటో బలగాలు చైనా చుట్టూ కూడా మోహరిస్తున్నారు. చైనా మన భూభాగాన్ని వందల మైళ్ల దూరం ఆక్రమిస్తుంటే మోదీ కిమ్మనకుండా కూర్చోవడాన్ని శాంతి ప్రియత్వం అనుకోలేం. పైగా అలాంటి ఆక్రమణ ఏమీ లేదని మోదీ బుకాయిస్తారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాత్రం ‘‘అమ్మో చైనా బలమైన దేశం’’ అని వాపోతారు. ఈ రెండు ప్రకటనలూ పరస్పర విరుద్ధమైనవని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ మాటలు ఆయన నిత్య అసత్య దండకంలో భాగమే. బంగ్లాదేశ్‌ లో కూడా నాటో బలగలాను మోహరించే ప్రయత్నం సాగుతుండడం ‘‘దేశ భక్తుడైన’’ మోదీ కంటికి కనిపించదెందుకో! మోదీ శాంతిమంత్రాలతో నిమిత్తం లేకుండా విదేశాంగమంత్రి జై శంకర్‌ రష్యా-ఉక్రెయిన్‌ సమస్య సంక్లిష్టమైందనీ ఏ శాంతి యత్నాల్లోనైనా రష్యా పాత్ర ఉండాల్సిందేనని అన్నారు. ఈ ఇద్దరి ధోరణిలో వ్యత్యాసాన్ని గమనించలేని వారు ఎవరూ ఉండరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img