Friday, December 2, 2022
Friday, December 2, 2022

రచ్చ చేయడమే బీజేపీ రాజకీయం

మోదీ హయాంలో పార్లమెంటు నూతన భవన నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ పార్లమెంటరీ సాంప్రదాయాల పరిరక్షణ మీద లేదు. ఏయే పదాలు పార్లమెంటులో ఉపయోగించకూడదో ఓ సుదీర్ఘమైన పదకోశం తయారు చేసిన సందర్భంలోనే పార్ల మెంటరీ సంప్రదాయాలు మంట గలుస్తున్నాయి. పార్లమెంటు వెలుపల జరిగిన పరిణామాల ప్రతిధ్వని పార్లమెంటులో వినిపి స్తోంది. ఈ సారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభ మైన తరవాత వాయిదా పడడమే చూస్తున్నాం. ఇంకేమైనా జరుగుతోందా అని నిశితంగా గమనిస్తే రోజూ కొంతమంది ప్రతి పక్ష ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో పార్లమెంటు ఆవరణలో ఎంపీలు నిర సన తెలిపే అవకాశం కూడా ఇవ్వడంలేదు. లోకసభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ పార్లమెంటు వెలుపల ఒక టీవీ చానల్‌ అడిగితే రాష్ట్రపతి గురించి మాట్లాడుతూ ఆమెను ‘‘రాష్ట్రపత్ని’’ అనడం కచ్చితంగా అభ్యంతరకరమైందే. అవమాన కరమైందే. అయితే ఆయన వెంటనే నాలుక కరుచుకుని రాష్ట్రపతి ముర్ము కనక బాధపడి ఉంటే స్వయంగా ఆమె దగ్గరకే వెళ్లి క్షమాపణ చెప్పడానికి సిద్ధమని చెప్పారు. పార్లమెంటు వెలుపల చేసిన అనుచిత వ్యాఖ్యకు పార్లమెంటు వేదిక మీదే క్షమాపణ చెప్పడానికి అధీర్‌ రంజన్‌ సిద్ధమయ్యారు. కానీ ఆయనకు ఆ అవకాశమే దొరకలేదు. చివరకు ఆయన లిఖిత రూపంలో రాష్ట్రపతిని క్షమాపణ కోరారు. కానీ ఈ సంఘటన ప్రతిపక్షం మీద, మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ మీద దాడి చేయడానికి బీజేపీకి మహదవకాశం కల్పించింది. దీన్ని బీజేపీ సంపూర్ణంగా వినియోగించు కుందని గురువారం పార్లమెంటు లోపల, వెలు పల జరిగిన సంఘ టనలే నిరూపిస్తున్నాయి. గురువారం పార్లమెంటు సమా వేశం కాగానే లోకసభలో స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ తమ దాడిని సోనియా గాంధీ మీదకు తిప్పారు. లోకసభలో అయితే సభ ప్రారంభం కాగానే స్మృతి ఇరానీ పది నిముషాలపాటు ఏకధాటిగా కాంగ్రెస్‌ మీద, ముఖ్యంగా సోనియా గాంధీ మీద విరుచుకు పడ్డారు. అధీర్‌ రంజన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సోనియా క్షమాణ చెప్పాలని ఆమె నినాదాలు ఇస్తున్న రీతిలో ప్రసంగించారు. ఇంకేముంది బీజేపీ నాయకులందరూ శ్రుతి కలిపారు. సభలో గందరగోళం మొద లైంది. స్పీకర్‌ సభను వాయిదా వేశారు. ఆ దశలోనే సోనియా గాంధీ బయటకు వెళ్లబోతున్న వారల్ల వెనక్కు తిరిగి బీజేపీ సీనియర్‌ సభ్యురాలు రమాదేవి దగ్గరకు వెళ్లి అధీర్‌ రంజన్‌ క్షమాపణ కోరుతున్నారు కదా ఈ గొడవలోకి నన్నెందుకు లాగుతున్నారు అన్నారు. ఇదంతా సభా కార్య క్రమాలలో భాగం కాదు. సభ వాయిదా పడిన తరవాత జరిగిన వ్యవహారం ఇది. ఆ దశలో సోనియా మీద నిప్పులు కురిపించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చరచరా సోనియా, రమాదేవి ఉన్న చోటికి వచ్చి సోనియాతో తగవు వేసుకున్నారు. నాపేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని సోనియా అన్న మాటను సాగదీసి ‘‘అవును నేనే మీ పేరెత్తాను. ఇప్పుడేమంటారు?’’ అని నిలదీశారు. ఆ దశలో సోనియా నేను రమా దేవితో మాట్లాడుతుంటే మీరు ఎందుకు మధ్యలో దూరుతున్నారు అని ప్రశ్నించారు. అంతే. స్మృతీ ఇరానీ మరింత రెచ్చిపోయారు. ఆ స్థితిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రా, ఎన్‌.సి.పి. సభ్యు రాలు సుప్రియా సూలే, మరో సభ్యురాలు అపురూప పోద్దార్‌ కలిసి సోనియాను సభ వెలుపలికి తీసుకెళ్లారు. సోమవారంనాడు అధీర్‌ రంజన్‌ రాష్ట్రపతిని కలిసి క్షమాపణ కోరనున్నారు. ఆయన రాష్ట్రపతిని ‘‘రాష్ట్రపత్ని’’ అనడం ఖండిరచవలసిందే. కానీ ఆయనకు సభలో ఆ అవ కాశం ఇవ్వకుండా సోనియా మీద దాడికి దిగడం, ఆ దాడికి ఇద్దరు మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ నాయకత్వం వహించడంÑ అరడజను మంది మంత్రులు వీరికి వత్తాసు పలకడంÑ మరో పదిమంది మహిళా ఎంపీలు వీరికి మద్దతు ప్రకటించడం, పార్లమెంటు భవనం ఆవరణలో ‘‘సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి’’ అని ప్లకార్డులు పట్టు కుని అధికారపక్ష ఎంపీలే నిరసన ప్రదర్శన చేయడం విస్తుగొలిపే అంశమే.
సోనియా మీద బీజేపీ విరుచుకుపడడానికి కారణం లేకపోలేదు. సోనియా అతి పెద్ద ప్రతిపక్షానికి నాయకురాలు కావడం ఒక్కటే కారణం కాదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ సోనియాను మూడు రోజుల పాటు గంటల తరబడి ప్రశ్నించినా ఆమెకు వ్యతిరేకంగా ఏ ఆధారమూ దొరికినట్టు లేదు. ప్రతిపక్షంలో తమ గొంతు వినిపిస్తున్న శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ విని యోగించి నోరు మూయించడానికి ప్రయత్నం చేశారు. ఎంతకాదన్నా ప్రతిపక్షానికి సోనియా సంకేతం. అందుకే ఆమె మీద బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది. దీనికి తోడు స్మృతి ఇరానీ కూతురు గోవాలో లైసెన్సు లేకుండా ఓ బార్‌ నడుపుతున్న వ్యవహారం బయటపడిరది. ఇది ఇరానీని ఇరుకున పెట్టే అంశం. ఈ విష యంలో బీజేపీ నాయకులెవరూ ఆమెకు అండగా నిలబడలేదు. ఇరానీ స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనను తాను సమర్థించుకోవలసి వచ్చింది. అవకాశం దొరికి నప్పుడల్లా విశ్వరూపం ప్రదర్శించడం స్మృతి ఇరానీకి అలవాటే. 2015లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోనియా ‘‘మీరు నాటకాలాడుతున్నారు’’ అంటే సుష్మ స్పందించలేదు కాని స్మృతి ముందుకొచ్చి సుష్మకు బాసటగా నిలిచారు. మూడు నెలల తరవాత 2015 ఆగస్టులో సోనియా ప్రభుత్వం గాలిలో మేడలు కడ్తున్నారు అని విమర్శించినప్పుడు కూడా స్మృతి ఇరానీనే ఎదురు దాడికి సిద్ధమయ్యారు. 2017లో క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో కూడా సోనియా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మళ్లీ స్మృతి ఇరానీనే దాడికి దిగారు. వివాదాస్పద వ్యవ సాయ చట్టాల ప్రసక్తి 2020లో వచ్చినప్పుడు మళ్లీ స్మృతి ఇరానీనే సోనియా ఏమన్నా రైతా అని ప్రశ్నించారు. స్మృతి కూడా రైతు కాదన్నది అందరికీ తెలుసు. పార్లమెంటులో ప్రధానమైన సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తి గత దాడులకే బీజేపీ మొగ్గు చూపుతోంది. నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలనే అరెస్టు చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి సోనియా మీద దాడి కేంద్రీకరించాలని బీజేపీ పక్కా వ్యూహం అనుసరి స్తోంది. గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ శాసనసభలకు వచ్చే ఏడాది చివరిదాకా వరసగా ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయంలో అసలు సమస్యలు ప్రస్తావనకు రాకుండా వాటిని గంపకింద కమ్మడానికే సోనియా మీద దాడి చేస్తు న్నారు. మాట తూలిన అధీర్‌ కనుమరుగైపోయారు. సోనియాను ప్రధానంగా చర్చలోకి తెస్తున్నారు. రచ్చ చేయడమే బీజేపీ దృష్టిలో రాజకీయం అయిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img