Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

వర్ష బీభత్సం

వర్షపు నీటికి, వరద నీటికి పల్లానికి ప్రవహించడం మాత్రమే తెలుసు. ఈ ఉధృతికి అన్నీ నీట మునిగి పోతాయి. గత మూడురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వర్ష బీభత్సం జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాలేక ఇబ్బందులు ఎదురైనాయి. ఆహారం, మంచి నీరు అందక, ఇళ్లు నీట మునిగిపోవడంవల్ల ఇబ్బందులు పడినవారి సంఖ్య అపారంగానే ఉంది. రెండు రాష్ట్రాలలోనూ పల్లపు ప్రాంతాలలో వర్షపు నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చవలసి వచ్చింది. మూడురోజుల కింద కురిసిన భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. తరవాతి రెండు రోజుల్లో ప్రాణనష్టం ఏమీలేదు. తెలంగాణాలో భారీ వర్షాలవల్ల 19 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణాకు మధ్య రైలు, రోడ్డు మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఆంధ్రప్రాంతం నుంచి హైదరాబాద్‌ ప్రాంతానికి రావడానికి పిడుగురాళ్ల మీదుగా ఉన్న దారే మిగిలింది. రైలు మార్గాలకు జరిగిన నష్టంవల్ల మొత్తం 69 రైళ్లు రద్దు చేయాల్సి వచ్చింది. శనివారం రాత్రి విజయవాడ మీదుగా తెలంగాణ ప్రాంతానికి రావలసిన రైళ్లన్నీ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఎప్పుడూ రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో జనం సందడే కనిపించలేదు. రైళ్లు రద్దయ్యాయన్న సమాచారం అందని కొంత మంది మాత్రమే కనిపించారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మీద వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. బుడమేరు పొంగడం వల్ల విజయవాడలో నగర జీవనం పూర్తిగా గాడి తప్పింది. తెలంగాణలో పాత ఖమ్మం, వరంగల్‌ జిల్లాల మీద ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు – చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి వరద ముంచెత్తిన ప్రాంతాలలో పర్యటించారు. జనాన్ని ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు జిల్లాలోని వరద ప్రాంతాలలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కూడా విజయవాడలో ముంపు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం అంతా సోమవారం తెల్లవారు జాము మూడు గంటల దాకా విజయవాడలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వాలు సత్వర సహాయక చర్యలు చేపట్టినప్పటికీ సహాయం అందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఆహార పొట్లాలు అందించారు. వీధులు జలమయమై పోయి చాలా చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు రావడంవల్ల అక్కడ నివాసం ఉండేవారు పైఅంతస్తుల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. బుడమేరు ఉధృతి కాస్త తగ్గిందనుకుంటే కృష్ణా నది పరవళ్లు విపరీతం అయిపోయినందువల్ల విజయవాడ నగర ప్రజల జనజీవనం అస్తుబిస్తు అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో వర్షం తగ్గు ముఖంపట్టినా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే గురువారం బంగళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో గుబులు మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాలపై ఈ అల్ప పీడన ప్రభావం ఉండొచ్చునంటున్నారు.
రోడ్లు జలమయం అయిపోవడమే కాక కురిసిన వర్షపు నీరు వెళ్లిపోవడానికి అవకాశం లేక వీధులు జలమయం కావడం మానవ తప్పిదమే అనుకోవాలి. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం మంచిదే కానీ ఆపద వచ్చినప్పుడు జన జీవితం గాడి తప్పకుండా నగరాలలో ప్రణాళికలు ఎలా అమలు చేయాలో ఇప్పటికీ అంతుపట్టడంలేదు. తెలంగాణాలో వర్ష బీభత్సం వల్ల రూ. 5,000 కోట్ల నష్టం కలిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రధానమంత్రి ఫోన్‌చేసి పరిస్థితి ఏమిటో తెలుసుకున్నారు. ఈ బీభత్సాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరుతున్నారు. తక్షణ సహాయంగా రూ. రెండు వేల కోట్లు అందించాలని రేవంత్‌ రెడ్డి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సహయాం అందుతుందో లేదో చెప్పలేం. పరామర్శతోనే సరిపుచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలకోసం కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన 40 మరపడవలు పంపించింది. మొత్తం వంద పడవలను వినియోగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి బాధితుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తెలంగాణలో సోమవారం జరగవలసిన వివిధ పరీక్షలను వాయిదా వేయవలసి వచ్చింది. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రాకూడదని ప్రభుత్వం సలహా ఇచ్చింది. సమాచార సాంకేతికత ఆధారంగా పనిచేసే సంస్థల ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని కోరారు. రెండు రాష్ట్రాలలో కలిగిన నష్టానికి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయక చర్యలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణాలో భవన నిర్మాణ కార్యకలాపాలను 48 గంటల పాటు నిలిపివేయాలని భవననిర్మాణ సంఘం వారు నిర్ణయించారు. అదే రీతిలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న ‘‘హైడ్రా’’ కూల్చివేతల కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా ఆపేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది జాతీయ విపత్తు నివారణా బృందాలు, రాష్ట్రానికి చెందిన పది బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జన జీవనానికి విపరీతమైన విఘాతం కలిగింది. 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్నిచోట్ల మొబైల్‌ ఫోన్లు కూడా మొరాయించాయి. రవాణా సదుపాయాలు అస్తవ్యస్త మైనాయి. విపత్తులను ఎదుర్కునే జాతీయ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంస్థ కలిసి 25,000 మందిని కాపాడడం ఊరట కలిగించే అంశమే. జనాన్ని కాపాడడానికి పడవలను వినియోగిస్తున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలలోని వారు కనిపించని తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్న దృశ్యాలు ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారంగా ఉన్నాయి. తమ పిల్లలకు పాలు, ఆహారం అందించాలని చాలా మంది వేడుకున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రకృతి విపత్తులు బతుకును ఎలా ఛిద్రం చేస్తాయో ఆలోచిస్తే భవిష్యత్తు మీద బెంగ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.ఆర్‌., గుంటూర్‌, కృష్ణా, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల మీద వర్ష బీభత్స ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఈ బీభత్సానికి గురయ్యారు. 31, 238 మందికి 166 సహాయక శిబిరాల్లో పునరావాసం కల్పించారు. ప్రకృతి విపత్తులు అనివార్యం కావచ్చు. కాని అవి ఎదురైనప్పుడు జన జీవనానికి భంగం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అసాధ్యం అయితే కాదు. వరదొచ్చినప్పుడే అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వాల వైఖరి మారితే ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం సాధ్యమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img