Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమానుష విడుదలపై ఆక్రోశం

రెండు దశాబ్దాల కిందట గుజరాత్‌లో జరిగిన మారణ కాండలో భాగస్వాములైన 11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం గత ఆగస్టు 15న విడుదల చేయడంపై తీవ్ర ఆక్రోశం ఇప్పటికీ వ్యక్త మవుతూనే ఉంది. బిల్కిస్‌ బానో అనే మహిళ మీద గుజరాత్‌ మారణ కాండ సమయంలో అత్యంత ఘోరమైన రీతిలో మూకు మ్మడి అత్యాచారం జరిగింది. ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులైన 14 మందిని కిరాతకంగా హతమార్చారు. అప్పటికి మూడేళ్ల యినా లేని బిల్కిస్‌ కూతురిని ఆమె కళ్ల ముందే బండకేసి బాది చంపేశారు. ఇంతకన్నా హీనమైన అత్యాచారం విని కూడా ఉండ మేమో. చివరకు ఆ 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిరది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని గుజరాత్‌ ప్రభుత్వం వారిని జైలు నుంచి విడుదల చేసింది. వారిని మళ్లీ జైలుకు పంపాలని మానవత్వం ఉందనుకునే వారందరూ ముక్త కంఠంతో కోరు తున్నారు. అయినా గుజరాత్‌ బీజేపీ ప్రభుత్వం చలించడం లేదు. 401 మంది రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు, సమాజంలో పలుకుబడిగల వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసి ఈ 11 మంది కిరాతకులకు జైలు శిక్ష తగ్గించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరిలో రాజ్య సభ సభ్యుడు జవహర్‌ సర్కార్‌, రాజకీయ నాయకుడు, పత్రికలలో తర చుగా వ్యాసాలు రాసే, ఇదివరకు అద్వానీకి, అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సన్ని హితంగా మెలగిన సలహాదారు సుధీంద్ర కులకర్ణిÑ అంబానీల గ్యాస్‌ కుంభ కోణాన్ని బద్దలు కొట్టిన ప్రసిద్ధ పత్రికా రచయిత పరంజయ్‌ గుహాతకుర్త లాంటి వారు ఉన్నారు. ఈ కిరాతకులకు జైలు శిక్ష తగ్గించి నందుకు అనేక మంది వీరు విడుదలపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండడం అమానుషమైన, నీతిబాహ్యమైన విధా నాన్ని అమలు చేసినట్టు అవుతోందని వారు ఈ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. హేయమైన నేరానికి పాల్పడ్డ వారు సైతం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందన్న దుష్ట సంప్రదాయానికి గుజరాత్‌ ప్రభుత్వం కారణమైందని వీరు తెలియజేశారు. ఇలా అమానుషమైన అత్యాచారాలకు పాల్పడే వారిని విడు దల చేస్తే ప్రజలకు న్యాయం, మానవత్వం, అసలు మానవ నాగరికత మీదే విశ్వాసం సడలి పోతుంది అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. జనం గోడు పట్టించుకోని ప్రభుత్వానికి ఇలా విజ్ఞప్తి చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు. రాజ్యాంగ ప్రవర్తనా బృందం పేరుతో 134 మంది ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌. అధికారులు కూడా సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాశారు. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న భయానకమైన ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని ఆదేశించాలని వీరు అభ్యర్థించారు. వీరే కాక సామాజిక కార్యకర్తలు, ప్రసిద్ధ రచయితలు, సినీ ప్రముఖులు మొత్తం ఆరు వేలమంది సుప్రీంకోర్టుకు ఇదే రకమైన అభ్యర్థన పంపించారు. వీరిని విడదల చేసిన రోజు స్వాతంత్య్ర దినో త్సవం కావడం ఒక్కటే విశేషం కాదు. ఆ రోజు ప్రధాన మంత్రి మోదీ ఎర్ర కోట బురుజుల మీంచి ప్రసంగిస్తూ మహిళల హక్కులు, గౌరవం, నారీ శక్తి లాంటి గొప్ప గొప్ప నీతి వచనాలు పలికారు. ప్రధాన మంత్రి ప్రసంగం పొద్దున జరిగితే ఆ మధ్యాహ్నమే ఈ 11 మందిని విడుదల చేయడం చట్టాన్ని, న్యాయాన్ని, నైతికతను అపహాస్యం చేయడానికే అను కోవలసి వస్తోంది. ఒక వేపు ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభు త్వమే అత్యంత కిరాతకులను విడుదల చేస్తే కిమ్మనని ప్రధాని ఇలాంటి హితవచనాలు, నీతి వాక్యాలు పలకడం కూడా ఆయన బూట కపు వాగ్దానాలలోనే జమకట్టక తప్పదు. నిజానికి సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేసి దోషులకు శిక్ష పడేట్టు చేసిన బిల్కిస్‌ బానోనే అసలైన నారీశక్తి. ఆ కిరాతకులను విడుదల చేశారు కనక ఆమె బిక్కు బిక్కు మంటూ బతకవలసి వస్తోంది.
జీవచ్ఛవంలా బతుకుతున్న బిల్కిస్‌ బానో వ్యధ అక్కడితో పూర్తి కాలేదు. ఆమె పోరాటం ఎంత తీవ్రమైంది అయినా, గౌరవాన్ని, జీవి తాన్ని, స్వేచ్ఛను, న్యాయాన్ని కాపాడడానికి ఆమె ఎంత పరితపిస్తున్నా ఒక మతం వారి విషయంలో విద్వేషం నింపడంలో క్షణం తీరిక లేకుండా ఉన్న బీజేపీ సర్కారుకు కనికరం ఉంటుందని అనుకోవడం భ్రమే. కిరాతకులను వెనకేసుకొచ్చే పార్టీ ఆ పదకొండు మంది విడుద లైన తరవాత వారిని పూలమాలతో సత్కరించింది. మిఠాయిలు పంచి పెట్టింది. గోధ్రా నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రావుల్జీ మరింత కిరాతకంగా ఆ 11 మంది ‘‘ఉన్నత విలువలు ఉన్న బ్రాహ్మణులు’’ అని కీర్తించడం మానవత్వం ఏ స్థితికి దిగజారింది అనడానికి నిదర్శనం. ఇందులో పురుషంకార ధోరణి మాత్రమే లేదు. కులాధిపత్యం, ముస్లిం లంటే ద్వేషం కూడా ఇమిడి ఉన్నాయి. దిల్లీలో ఒక మహిళపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడిన వారిని 2012 డిసెంబర్‌లో ఉరి తీసినప్పుడు ఇది ప్రజల అంతరాత్మ అన్నారు. హైదరా బాద్‌లో ఇలాగే ఒక మహిళపై మూకుమ్మడి అత్యాచారం చేసి హతమార్చిన నలుగురిని పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లో హతమార్చినప్పుడు ఆ అంత రాత్మ ఎక్కడికి పలాయనం చిత్తగించినట్టు? అంటే నేరస్థులను వెనకేసుకు వచ్చేవారికి న్యాయమార్గ పాలన మీద ఎటూ నమ్మకం లేదు. న్యాయస్థానాల తీర్పులను గౌరవించే సంస్కారం అంతకన్నా లేదు. బిల్కిస్‌ బానో మీద అత్యాచారం చేసిన వారిని విడుదల చేయడానికి సిఫార్సు చేసిన పది మందితో కూడిన కమిటీలో బీజేపీతో సంబంధం ఉన్నవారే ఎక్కువ. ఇందులో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సంఘ సంఘసేవకురాలి పేరుతో ఈ కమిటీలో ఉన్న వినీత లేలే సైతం బీజేపీ సభ్యురాలే. సంఘ సేవకుల పేర ఈ కమిటీలో ఉన్న పవన్‌ భాయ్‌ సోనీ, సర్దార్‌ సింఫ్‌ు పటేల్‌ కూడా బీజేపీ సభ్యులే. జైలు సూపరిం టెండెంట్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌, ప్రధాన జిల్లా జడ్జి, ఒక జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సైతం ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి నాయకత్వం వహించింది పంచ్‌ మహల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌. బీజేపీతో సంబంధం ఉన్న వారి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రభుత్వోద్యోగాల్లోనో, న్యాయ వ్యవస్థలోనో భాగమైన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారను కోవడం కుదిరే పని కాదు. నియమం ప్రకారం ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తిని కూడా సంప్రదించ లేదు. ఈ కమిటీ ఆ అంశాన్ని పట్టించుకోనే లేదు. క్రౌర్యానికి పాల్పడ్డ వారిని విడుదల చేయడం బీజేపీ వ్యవహార సరళికి ప్రబలమైన నిదర్శనం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img