Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్నికల కమిషన్‌కు తగని పని

రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు నెరవేర్చడానికి ఎదురయ్యే ఆర్థిక చిక్కులను తెలియజేస్తూ అఫిడవిట్‌ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదించింది. ప్రభుత్వం చేసే వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం పైన పడే భారాన్ని గురించి ఓటర్లకు వివరించాలన్నది ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనలో భాగం. ఈ విషయం ఎన్నికల కమిషన్‌ పరిధిలో ఉందా? రాజ్యాంగ సంస్థ ఎన్నికల కమిషన్‌ పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వివక్ష లేకుండా స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతేకానీ సంక్షేమ కార్యక్రమాలు, ఉచితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించు కుంటాయి. అసలు సంక్షేమ కార్య క్రమాలు, ఉచితాలు వాగ్దానం చేసి అమలు చేయవలసిన పనిలేని స్థితికి మన దేశం చేరిందా? వాగ్దానాలకు ఎంత ఖర్చు చేయవలసి వస్తుందని ఆయా పార్టీలు వెల్లడిరచాలన్న అంశాన్ని 2015లోనే మోడల్‌ కోడ్‌లో ఎన్నికల కమిషన్‌ చేర్చింది. ఇప్పుడు దాన్నొక విధానంగా రూపొందించి అమలు చేయాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాది స్తున్నది. ఇటీవల ఉచితాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, అవి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయాన్ని తీసు కోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో జస్టీస్‌ ఎన్వీ రమణ కూడా వ్యాఖ్యా నించారు. మోదీ ఉచితాల విషయాన్ని ప్రస్తా వించడం ప్రజల దృష్టిని మళ్లించడానికేగానీ ఉచితాలను నిషేధించా లన్నది ఆయన బలమైన ప్రతిపాదన కాదని జరుగుతున్న పరిణా మాలు తెలియజేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన అంశాన్ని పార్ల మెంట్‌లో కనీసం చర్చ లేకుండా ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదించడం ఏమిటి? ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పని చేయ వలసిన సంస్థ కేంద్ర పాలకుల కనుసన్నల్లో పని చేస్తున్నదన్న విమర్శలు ఇటీవల వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్‌కు ఉండే పరువు, ప్రతిష్ఠలు దిగ జారాయని, రానురాను ప్రజల నమ్మకం కమిషన్‌ పట్ల సడలిందని గత కొన్నేళ్లుగా అది అనుసరిస్తున్న పద్ధతులు తెలియజేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు ప్రకటన నుండి, ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అన్ని కార్యకలాపాల పైన విమర్శలు వస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టిఎన్‌ శేషన్‌ పనిచేసిన కాలంలో ఆయా పార్టీలు గడగడలాడాయి. ఆయన నిక్కచ్చిగా, నిజాయితీగా ఎన్నికలు నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కమిషన్‌ తనకుగాని పనిని తలకెత్తుకున్నదని, ఎవరి ప్రయోజనం కోసం ఇలా వ్యవ హరిస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారంలోకి వచ్చిన పార్టీ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రజల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ రూపకల్పన చేసుకుంటుంది. అలాగే ఎన్నికల ప్రచారంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు, ప్రాజె క్టుల నిర్మాణం, కొన్ని ఉచితాలను ఎన్నికల ప్రణాళికలో చేరుస్తాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. అందువల్ల దేశంలో అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడటం కుదిరే పని కాదు.
ఈ ప్రతిపాదనను మోదీ అధికారంలోకి రాకముందే 2013లోనే వినిమయ వస్తువులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఏఏ వస్తువులు ఉచితంగా ఇవ్వవచ్చు నన్నది నిర్ణయించలేదు. ఇవి నిర్ణయించుకొనేందుకు అయా రాజకీయ పార్టీలకు హక్కు ఉందని కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మోదీ తన ప్రచార సభల్లో చేసినన్ని వాగ్దానాలు మరెవరూ చేసి ఉండరు, అయితే ముఖ్యమైన వాటితో సహా అత్యధిక వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదు. అది వేరే విషయం. ఇక ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఆర్థిక పరిస్థితులన్నీ తల్లకిందులవు తాయి. తీవ్రంగా నష్టపోయిన రైతులుగానీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు గానీ ప్రభుత్వ సహాయం లేకపోతే కోలుకోవడం అత్యంత కష్టం. రెండేళ్లు కోవిడ్‌`19 మహమ్మారి కాలంలో కోట్లాది మంది ఉపా ధులు, ఉద్యోగాలు కోల్పోయారు. వీరికి జీవనం దుర్భరంగా మారింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం అందించింది. అవి కూడా బియ్యం, గోధుమలు, ఇతర కొన్ని నిత్యావసర వస్తువులు అందించింది. అనేక దేశాలు నగదును సైతం సహాయం చేశాయి. ఇదే కాలంలో బడా సంపన్నులకు రూ.145 కోట్ల రూపాయలను రాయితీలు మోదీ ప్రభుత్వం అందించింది. సంపన్న వర్గాలకు విధించే పన్నును 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించింది. ఇవి ఉచితాలు కావా? యుపిలో కోవిడ్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం బీజేపీ గెలవడానికి ఉపయోగించింది. బ్యాంకులకు రుణాలను చెల్లించవలసిన బడా పారిశ్రామికవేత్తలు ఎగవేసినా వాటిని ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. రద్దు చేసిన పారు బకాయిలు మోదీ పాలనలో 12 లక్షల కోట్లుకు పైగా ఉన్నాయని రిజర్వుబ్యాంకు అధికారికంగా ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి వీటినేమందాం. ఇక దేశంలో మున్నెన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. పేదరికం పెరుగుతోంది. ఆర్థిక అసమానతలు కొండలా పెరిగిపోతున్నాయి. పైగా ఉచితాలను నిర్ణయించడం అసాధ్యం. ఒక ప్రాంతంలో ఉన్న పరిస్థితులు మరోచోట ఉండవు. ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణ యించుకోవాలి. అందువల్ల ఉచితాలు సహేతుకమా కాదా అని ఎన్ని కల కమిషన్‌ ఎలా నిర్ణయిస్తుంది. పైగా ఉచితాలు మంచిది కాదని వాదించే ‘మేధావులు’ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించకుండా, ప్రజల అవసరాలను తెలుసుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారని భావించ వలసి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయవచ్చు. ప్రజలకు అందించే సహాయం వల్లనే ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు దెబ్బ తింటాయని చెప్పేవాళ్లు లక్ష్ల కోట్ల రాయితీలను, బకాయిల రద్దులను గురించి మౌనం వహిస్తున్నారు. ఇదంతా ప్రజలు చెల్లించే పన్నుల నుండి వచ్చే ఆదాయం అన్న విషయం మరవరాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img