Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కనీస మద్దతు ధరపై కపట నాటకం

రైతులు దిల్లీ పొలిమేరల్లో ఏడాదికి పైగా నిరసన వ్యక్తం చేసిన తరవాత వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటు న్నట్టు గత నవంబర్‌లో ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటిం చారు. ఆ తరవాత కొద్ది రోజులకే రైతులు తమ నిరసన విర మించారు. రైతులు ఉద్యమం చేసింది కేవలం వివాదాస్పద వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలన్న కోరిక కూడా వారి డిమాండ్లలో ప్రధానమైందే. దానిని చిత్తశుద్ధితో పట్టించుకోవడానికి మోదీ సర్కారు సిద్ధంగా లేదని మరోసారి రుజువైంది. రైతుల సమ స్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తరవాత ఎనిమిది నెలలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల వ్యవహారాన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో సభ్యుల పేర్లు చూస్తే చాలా గొప్పగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే కమిటీలో ఉన్న అత్యధికులు వివాదాస్పద వ్యవ సాయ చట్టాలను సమర్థించిన వారే కనిపిస్తున్నారు. సహజంగానే సుదీర్ఘమైన రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ కమిటీని తిరస్కరించింది. దొడ్డి దారిన వివాదా స్పద చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని సంయుక్త కిసాన్‌ మోర్చా అంటోంది. కేంద్ర ప్రభుత్వంలో ఇదివరకు వ్యవ సాయ శాఖ కార్యదర్శిగా పని చేసిన సంజయ్‌ అగర్వాల్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. ఆయన ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలుడని ప్రత్యే కంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం మొక్కుబడిగా కమిటీ అయితే వేసి ఈ సమస్యను మరి కొన్నాళ్లు సాగదీయాలని చూస్తున్నట్టు స్పష్టం అవుతోంది. సమస్యను పరిష్కరించే ధోరణి ఎక్కడా కనిపించడం లేదు. అన్నింటికన్నా మించి ఈ కమిటీ కనీస మద్దతు ధరలకు చట్ట ప్రతిపత్తి కల్పించడానికి కృషి చేస్తుందన్న సూచన కూడా లేదు. గత నవంబర్‌లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించినప్పుడు రైతులకు క్షమాపణ చెప్పడంతో పాటు కనీస మద్దతు ధర అంశాన్ని చర్చిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరకపోగా ప్రభుత్వానికి అనుకూలమైన వారికి ఆ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించడాన్నిబట్టి చూస్తే కనీస మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ కోశానా ఉన్నట్టు కని పించడం లేదు. ఈ కమిటీలో నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌, వ్యవ సాయ ఆర్థిక శాస్త్రవేత్త సి.ఎస్‌.సి. శేఖర్‌, అహమదాబాద్‌ ఐ.ఐ.ఎం.కు చెందిన సుఖ్‌ పాల్‌ సింగ్‌, వ్యవసాయ ధరల కమిషన్‌లో సీనియర్‌ సభ్యుడు నవీన్‌ పి.సింగ్‌ మొదలైన వారు ఉంటారని మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గజెట్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కమిటీలో జాతీయ అవార్డు సాధించిన భరత్‌ భూషణ్‌ త్యాగీతో పాటు సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన ముగ్గురు సభ్యులు, ఇతర రైతు సంఘాలకు చెందిన గుణ్వత్‌ పాటిల్‌, క్రిష్ణవీర్‌ చౌదరి, ప్రమోద్‌ కుమార్‌ చౌదరి, గుణి ప్రకాశ్‌, సయ్యద్‌ పాశా పటేల్‌ కూడా ఉంటారట. రైతులు దిల్లీ పొలిమేరల్లో ఉద్యమం చేస్తున్నప్పుడు వారి పక్షాన నిలబడి ఒక్క మాటైనా మాట్లాడిన వారు ఇంతమందిలో ఎంత వెదికినా ఒక్కరు కూడా కనిపించడం లేదు. రైతుల సహకార సంఘాలకు చెందిన ఇద్దరు, ఇఫ్కో చైర్మన్‌ దిలీప్‌ సంఘాని, సి.ఎన్‌.ఆర్‌.ఐ. ప్రధాన కార్యదర్శి వినోద్‌ ఆనంద్‌ కూడా ఈ కమిటీలో ఉంటారట. ఈ జాబితా అక్కడితో ముగియలేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సీనియర్‌ సభ్యులు, ప్రభుత్వ కార్యదర్శులు అయిదుగురు ఉంటారట. ఈ కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రా లకు చెందినవారు. వీరందరూ రైతుల అసలు డిమాండు అయిన కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తి గురించి మాట్లాడతారని అనుకోవడానికి అవ కాశమే లేదు.
కమిషన్‌ ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వం ఏకపక్షంగానే వ్యవహరిం చింది. ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి ముందు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు నాయకులెవరినీ సంప్రదించిన దాఖలాలు లేవు. ఏకపక్షంగా కమిటీ నియమించేసి ఓ పని అయిపోయింది అనిపించుకోవడా నికే ప్రభుత్వం ప్రయత్నించిందని రుజువు అవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులోని మతలబు గమనించినా రైతుల కోర్కెను తీర్చే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతోంది. ఈ కమిటీ రైతు లకు కనీస మద్దతు ధర అందే మార్గాలను పరిశీలిస్తుందట. కనీస మద్దతు ధర అందించే వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే అంశాన్ని పరిశీలిస్తుందట. వ్యవసాయ వ్యయం, ధరలను దాపరికం లేకుండా నిర్ణయించే అంశాన్ని పరిశీలిస్తుందట. దీనికోసం వ్యవసాయ ధరల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశాన్నీ అన్వేషిస్తుందట. అంటే ఇంతవరకు ఆ కమిషన్‌ పరాధీ నంగా అంటే ప్రభుత్వం మీద ఆధారపడే పని చేస్తోందని తేలిపోతోంది. దేశంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలో సూచిస్తుందట. రైతులకు గిట్టుబాటు ధర లభించేట్టు చూస్తుందట. దేశీయ, ఎగుమతుల అవకాశాలను కూడా బేరీజు వేస్తుందట. మరీ విచిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధర అంశాన్ని పరిశీలించవలసిన ఈ కమిటీ ప్రకృతిసిద్ధ వ్యవసాయం ఎలా చేయాలో, పంటల్లో వైవిధ్యం ఎలా ఉండాలో, సూక్ష్మ నీటిపారుదల పథకాల వైనం ఏమిటో పరిశీలించి కృషి విజ్ఞాన కేంద్రాలను, ఇతర పరిశోధన, అభివృద్ధి సంస్థలు ఏం చేయాలో కూడా సిఫార్సు చేయాలట. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేస్తోందని రైతులు ఎప్పుడో గ్రహించారు. అందుకే తాజా పరిస్థితిని చర్చించడానికి సంయుక్త కిసాన్‌ మోర్చా నాయ కులు మంగళవారం సమావేశం అయ్యారు. ఆ సమావేశంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని తిరస్కరించాలని నిర్ణయించారు. ఈ తిరస్కరణలో రైతు నాయకుల్లో పూర్తిస్థాయి ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. రైతుల సమస్యతోనూ, ఉద్యమంతోనూ ఎలాంటి సంబంధం లేని ఈ కమిటీ తమకు ఆమోద యోగ్యం కాదని తెగేసి చెప్పారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన రైతు నాయకులందరూ ఈ కమిటీని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. అంటే రైతుల్లో ఎంతటి అసంతృప్తి గూడు కట్టుకుని ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేసిన తీరు చూస్తే రద్దు చేసిన వివాదాస్పద చట్టాలను దొడ్డిదారిన మళ్లీ ప్రవేశ పెట్టాలన్న కుట్ర బాహాటంగా కనిపిస్తోందని రైతు నాయకులు అంటున్నారు. ఈ కమిటీలో కార్పొరేట్‌ రంగానికి చెందిన వారికి చోటివ్వడం చూస్తే రైతుల ఆందోళన సబబైందిగానే కనిపిస్తోంది. ఈ కమిటీ పరిశీలనాంశాల్లో మద్దతు ధరకు పరిమితం కాకుండా ఇతరేతర అంశాలను చేర్చడంలోనే ప్రభుత్వ కుతంత్రం బయటపడ్తోంది. కేవలం ఒక లాంఛనం పూర్తి చేయడం మీదే ప్రభుత్వం దృష్టి సారించింది. కేవలం కనీస మద్దతు ధర గురించే పరిశీలించే కమిటీ మాత్రమే ఉండాలన్నది రైతుల వాదన. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేదాకా తమ పోరాటం కొన సాగుతుందని రైతు నాయకులు ప్రకటించారు. ఈ కమిటీ ఏర్పాటులో ఉన్న డొల్లతనాన్ని కనిపెట్టినందువల్లే సంయుక్త కిసాన్‌ మోర్చా తమ తరఫున ఈ కమిటీలో ఉండే వారి పేర్లేవీ తెలియజేయలేదు. రైతులు మళ్లీ ఇదివరకటి స్థాయిలోనే ఉద్యమించగలరా లేదా అన్న విషయంలో భిన్నాబి óప్రాయాలు ఉండవచ్చు. అదే జరిగితే ప్రభుత్వం కొరివితో తల గోక్కోవడానికీ, కార్పొరేట్లకు దోచి పెట్టడానికే సిద్ధ పడ్తోందని మాత్రం అర్థం అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img