Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నరక ప్రాయంగా నగరాలు

నగరాలలో నివసించే ప్రజల జీవనం రోజురోజుకీ నరక ప్రాయంగా మారుతోంది. ఇక అసాధారణ వర్షాలు, వరదలు నగ రాలను ముంచెత్తి బెంబేలు పరుస్తున్న స్థితి పెరిగింది. తాజాగా బెంగళూరులో మున్నెన్నడు ఎరుగని స్థాయిలో వర్షాలు కురిసి నగరాన్ని ముంచేసింది. ప్రజా జీవనం స్తంభించింది. రవాణా ఆగి పోయింది. అన్ని రకాల వాహనాలు ఎక్కడి వక్కడ నిలిచిపోయాయి. కార్లలో ప్రయాణించిన వారు ఆదివారం కురిసిన కుండపోత వర్షా నికి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ వాహనాల్లోనే ఉండిపోయారు. నగరాల ఈ దుస్థితికి పాలకులు అనుసరిస్తున్న విధానాలు, వేగంగా మారుతున్న జీవన విధానం ప్రధాన కారణాలు. 2005 జులై 5న సముద్రం ఒడ్డున విస్తరించిన మహా నగరం ముంబైలో ఒక్కరోజులో 944 మిల్లీ మీటర్ల వర్షం కురిసి నగరవాసులను తల్లడిల్లింపజేసింది. వరద నీరు కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో మొదటి ఫ్లోర్‌లు కూడా మునిగి పోయాయి. రైలు, రోడ్డు రవాణా రోజుల తరబడి నిలిచిపోయింది. అప్పుడు వేయి మందికి పైగా మృతి చెందారు. లక్షల మంది చెప్ప లేనన్ని ఈతి బాధలకు గురయ్యారు. రోజువారీ పనులు చేసుకొనే వారి, ఇతర ప్రాంతాల నుంచి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారి జీవనం తల్లకిందులై పోయింది. లక్షకు పైగా వాహనాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మురికి కాల్వలు చెత్తా చెదారంతో నిండిపోయి వర్షపు నీరు పారకుండా నిలిచి పోయింది. నగరం నదులను తలపించింది.
ఒకానొక నాడు పచ్చదనంతో బెంగళూరు నగరం ప్రశాంత జీవన పరిస్థితుల్లో ఉండిరది. ఇప్పుడు మరో సిలికాన్‌ వ్యాలీగా ఐటి రంగం అసాధారణ విస్తరణతో మారిపోయింది. ముంబైలో భీతి గొల్పినంతగా బెంగళూరు పరిస్థితి లేకపోయినా ఇక్కడి దుస్ధితి, ప్రజల అవస్థలు ఇతర నగరాలకు తీవ్రమైన హెచ్చరిక. పాలకుల, కార్పొరేట్ల అత్యాశ, ప్రభుత్వ యంత్రాంగాల మితిమీరిన అవినీతి ఈ దుస్థితికి ప్రధాన కారణం. వ్యవ సాయాన్ని గ్రామీణ జీవనాన్ని చిన్నాభిన్నం చేసి నగరాల విస్తరణ విధా నాలను పాలకులు అమలు చేయడం అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల ప్రాంతాలను మంత్రులకు, అధి కారులకు ముడుపులు చెల్లించి ఆకాశ హర్మ్యాలను నిర్మించడం అధికమై పోయింది. నగరాలు మాత్రమే ఉద్యోగ, ఉపాధి కేంద్రాలుగా మార్చిన విధా నం సర్వత్రా విస్తరించింది. ఫలితంగా వేగంగా గ్రామాల నుండి ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లి వ్యాపారాలు, పరిశ్రమల నిర్మాణం తదితర ఉపాధి కల్పనా సంస్థలను నెలకొల్పి జీవిస్తున్నారు. భారీ పరిశ్రమల యజ మానులు, పలుకుబడి గలిగిన వారు లంచాలిచ్చి చివరికి కాల్వలు, డ్రైయిన్‌లను కూడా ఆక్రమించుకుంటున్నారు. ఇది బెంగళూరు నగరానికే పరిమితం కాదు. అన్ని పట్టణాలు, నగరాల్లో పరిస్థితి ఇదే. బెంగళూరులో సంపన్నులు, సామాన్యులన్న తేడా లేకుండా వరదల వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితులు లేనందువల్ల ఐటి కంపెనీలు ఉద్యోగులను ఇళ్ల వద్ద నుంచే పనిచేసే సదు పాయం కల్పించడం వారికి కొంత ఊరట కల్పించింది. నగరాల నిర్మాణ ప్రణాళికలోనే లోపాలున్నాయి. గతంలో ఉన్న నగరంలో ఇరుకిరుగ్గా నివాస భవనాల నిర్మాణానికి అనుమతించకుండా పరిసరాల్లో, విపత్తులు నివా రణకు వీలుగా టౌన్‌షిప్‌లు నిర్మించవచ్చు. వీటికి సమీపంలోనే ఐటి కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగుల నివాసాలకు దగ్గరలో సదుపాయాలు కల్పించినట్లయితే క్రిక్కిరిసిన రవాణాను మినహాయించవచ్చు. తద్వారా గణ నీయంగా కాలుష్యం తగ్గుతుంది. అలాగే పరిశ్రమల ఇతర సంస్థల ఏర్పా టును వికేంద్రీకరించినట్లయితే కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పెను కాలుష్యం కలిగిస్తున్నా ఇంధనాల వినియోగం తగ్గుతుంది. తరుముకొస్తున్న నీటి కొరతను చాలా వరకు అధిగమించవచ్చు. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలన్న యోచన ఉంటే పాలకులు తమ విధానాలను మార్చుకుంటారు. అలా గాకుండా అసాధారణంగా ఆర్థిక అసమానతలకు దారి తీస్తున్నంత కాలం ఈ విపత్తులను నివారించడం కష్టం.
ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి బెంగళూరుకు వలస వచ్చిన వారే ఈ వరదలకు కారణమని ఆరోపిస్తూ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేయడం దారుణం. వలస వచ్చిన వారంతా బెంగళూరును విడిచి వెళ్లి పోవాలని కోరడం వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేని అజ్ఞానులే. వలస వచ్చిన కూలీలు లేక భవనాలు, నాలుగు, ఆరు లైన్ల రహదారులు, పై వంతె నల నిర్మాణం సాధ్యమేనా? ఇలా దుష్ట ప్రచారం చేస్తున్న వారు, వీటిని తిప్పికొడుతూ పోస్టులు పెడుతున్న వారి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొన్నది. నగరాలు జనంతో క్రిక్కిరిసిపోతు న్నాయి. ట్రాఫిక్‌ గంటల తరబడి ఆగిపోతోంది. ఇక భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజల కష్టాలు చెప్పనలవి కావు. ఉద్యోగాలకు, చదువులు, మెరుగైన వైద్య చికిత్సల కోసం వచ్చేవాళ్లు, ఐటి కంపెనీల ఏర్పాటు ద్వారా ఆదాయాలు పెరుగుతాయి. సొంత స్థలాలను వదలిపెట్టి జీవనో పాధి కోసం, చదువుల కోసం, రోజువారి పనుల కోసం ఇతర దేశాల్లో వలసదారులు వెళ్లిపోవా లని పట్టుబడితే కల్లోలం తప్పదు. తమకు పన్నుల రూపంలో అపారంగా ఆదాయం లభిస్తున్న విషయాన్ని మరిచి విద్వేషం పెంచే విధంగా వ్యవహ రించడం దుర్మార్గం. ఇలాంటి దుస్థితి తలెత్తడానికి కారణా లేమిటి? పరిష్కారాలు ఏమిటి? అన్న విషయాలు ఆలోచించాలి. అవసర మైన విధానాలను రూపొందించాలని పాలకులపై ఒత్తిడి తేవాలి. నగరాల విస్తరణ వల్ల పౌరులకు మేలైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ వరదలకు గత ప్రభుత్వాలు కారణమని నేటి పాల కులు ఆరోపించడం తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకే. మత విద్వే షాలను రెచ్చగొట్టి సమాజంలో అల్లర్లు, అలజడి సృష్టించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ నేటి పాలకులకు ప్రజల బాగోగులను చూసే తీరిక లేదు. ఆరోపణలు చేయడం తేలికే. పని చేయడం ద్వారా పాలకులు తమ సత్తా నిరూపించుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img