Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బిల్కిస్‌ బానో నిరంతర క్షోభ

గుజరాత్‌లో రెండు దశాబ్దాల కింద జరిగిన మారణకాండ సమయంలో సామూహిక అత్యాచారానికి గురై, కుటుంబ సభ్యు లలో ఏడెనిమిది మందిని హత్య చేయడాన్ని చూసి, మూడేళ్ల తన కూతురిని బండకేసి బాది కిరాతకంగా ప్రాణాలు తీసేసిన కిరాత కాన్ని భరించిన బిల్కిస్‌ బానో గాయాలు ఆమె జీవితకాలం అంతా క్షోభ పెడ్తూనే ఉంటాయి. స్వాతంత్య్ర దిన అమృతోత్సవాల సంద ర్భంగా ఆమె మీద సామూహిక అత్యాచారం చేసిన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడంవల్ల మానని ఆమె గాయాల్ని గుజరాత్‌ ప్రభుత్వం పనిగట్టుకుని మళ్లీ రేపింది. ఏ మాత్రం మానవతా భావాలున్న వారైనా ఇలాంటి సంఘటనలు విని భరించడం, స్థిమితంగా ఉండడం అసాధ్యమే. నేర విచారణా ప్రక్రియలోని 432, 433 సెక్షన్ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి గుజరాత్‌ ప్రభుత్వం బిల్కిస్‌ బానో మీద అత్యాచారానికి పాల్పడిన వారిని జైలు నుంచి విడుదల చేసింది. వారి వయసు, చేసిన నేర స్వభావం మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకుని వారిని విడుదల చేసినట్టు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించి సభ్య సమాజాన్ని నివ్వెరపోయేట్టు చేసింది. గుజ రాత్‌ ప్రభుత్వం నేర విచారణా స్మృతిలోని అంశాలను వినియోగించు కుని అత్యాచారానికి పాల్పడి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ వారిని విడు దల చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కాకపోవచ్చు. కానీ అదే నేర శిక్షా స్మృతిలోని 435వ సెక్షన్‌ ఇంతటి హేయమైన నేరాలకు పాల్పడిన వారిని జైలు నుంచి విడుదల చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అంగీకారం ఉండాలని కూడా చెప్తోంది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసింది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ. ఇలాంటి సందర్భాలలో ఖైదీలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని 2021లో దిల్లీ హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఈ 11 మందిని విడుదల చేయడానికి అనుమతించి ఉంటే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని, అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షా కాలం పూర్తి కాకుండా అంటే జీవితాంతం జైలులో ఉంచకుండా విడుదల చేయ కూడదన్న తమ విధానాలనే ఉల్లంఘించినట్టు లెక్క. వీరిని విడుదల చేయ డానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించలేదన్న వార్తలూ వెలువడ్డాయి. అలాం టప్పుడు గుజరాత్‌ ప్రభుత్వం పూర్తి పక్షపాత దృష్టితో వారిని విడుదల చేసిం దనుకోవాలి. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఈ 11 మంది తాము 14 ఏళ్ల శిక్షా కాలం పూర్తి చేశాం కనక విడుదల చేయాలని అభ్యర్థించా రట. ఈ విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరిందట. సుప్రీంకోర్టు తీర్పులూ ఎంత హేయమైన నేరాలకు పాల్పడిన సందర్భంలోనైనా ఒకే రకంగా ఉండడం లేదు. నాలుగేళ్ల పసి పాప మీద ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినా సుప్రీంకోర్టు అతడిని విడుదల చేసింది. సాక్ష్యాధారాలు కొరవడో లేదా మరో కారణం చేతో విడుదల చేయలేదు. పైగా సుప్రీంకోర్టు అత్యాచారానికి గురైన వారి గుండెల్లో గున పాలు గుచ్చినట్టుగా ‘‘ప్రతి పాపికీ ఓ భవిష్యత్తు ఉంటుంది’’ అని వ్యాఖ్యా నించి మరీ విడుదల చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆసీనులై ఉన్న వారే ఇలాంటి వైఖరి అనుసరిస్తే అమానుషమైన ఘాతుకాల పాలైన అభాగ్యులకు ఇక దిక్కెవరు? ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుం దేమో! తాము రాజకీయ కుట్రలకు బలైనామని విడుదలైన 11 మంది అంటున్నారు. వీరిని విడుదల చేయడంలోనూ రాజకీయాలు ఉండొచ్చు. ఈ ఏడాది ఆఖరులో గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది. హిందూ మత పరిరక్షణను గుత్తకు తీసుకున్న బీజేపీ కిరాతకమైన అత్యా చారానికి పాల్పడిన 11 మందిని విడుదల చేయడం హిందువుల జీవితా లను పరిరక్షించడానికి, హిందువుల ఓట్లు దండుకోవడానికే అంటే ఈ అంశాన్ని రాజకీయ దృక్కోణం చూసినట్టు కనిపించవచ్చు. కానీ వాస్తవం అంతకన్నా భిన్నమైంది అని చెప్పే అవకాశమూ లేదు.
హిందువుల పరిరక్షణ కోసం బీజేపీ న్యాయ ప్రక్రియను కూడా విని యోగించుకోవడానికి, నిజం చెప్పాలంటే దుర్వినియోగం చేయడానికి ఏ మాత్రం వెనుకాడదని అడుగడుగునా రుజువు అవుతూనే ఉంది. విడుద లైన 11 మంది స్వేచ్ఛగా తిరగొచ్చు. గుజరాత్‌ ఎన్నికలలో ప్రజాస్వామ్య విరాట్‌ స్వరూపాన్ని కళ్లారా చూడవచ్చు. ఈ పదకొండు మంది తమను జైలు నుంచి విడుదల చేయాలని పెట్టుకున్న అర్జీని పరిశీలించి నిర్ణయం తీసు కోవడానికి ఏర్పాటు చేసిన కమిటీలో బీజేపీతో నేరుగా సంబంధం ఉన్న వారే నలుగురు ఉన్నారు. అందులో ఇద్దరు బీజేపీ శాసన సభ్యులు-సి.కె. రావుల్జీ, సుమన్‌ చౌహాన్‌. ఈ కమిటీకి గోధ్రా జిల్లా కలెక్టర్‌ సుజల్‌ మయత్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా 11 మంది విడుదలను అభ్యంతర పెట్టకపోవడం ఎంత మాత్రం ఆశ్చర్యకరం కాదు. ప్రస్తుత పరిస్థితిలో అత్యంత సహజం. కమిటీలో మరో ఇద్దరు సభ్యులలో ఒకరు గోధ్రా మాజీ మునిసిపల్‌ కౌన్సిలర్‌ మురళి మూల్చందాని. మరొకరు బీజేపీ మహిళా విభాగం కార్యకర్త స్నేహా బెన్‌ భాటియా. మూల్చం దానీ గోధ్రా రైలు పెట్టెల దగ్ధం కేసులో ప్రాసిక్యూషన్‌ అంటే ప్రభుత్వ తరఫు సాక్షి కూడా. గోధ్రా సంఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక సత్వర విచారణా న్యాయస్థానం మూల్చందానీతో పాటు మరో ఇద్దరు సాక్షులైన నితిన్‌ పాఠక్‌, రంజిత్‌ జోధా పటేల్‌ సాక్ష్యాన్ని నమ్మకుండా నిరాకరించింది. గుజరాత్‌ ప్రభుత్వం నియమించిన కమిటీలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, ఒక సెషన్స్‌ జడ్జి, జైలు సూపరింటెండెంట్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వోద్యోగం చేసేవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే సాహసం చేయలేరుగా! ఈ కమిటీ బాధితురాలైన బిల్కిస్‌ బానోను మాత్రం సంప్ర దించలేదు. ఆ 11 మంది విడుదలైతే ఆమెకు ఏ మాత్రం రక్షణ ఉంటుంది అని ఆలోచించిన దాఖలాలూ లేవు. ఈ 11 మంది నేరస్థులు విడుదలైన తరవాత విశ్వహిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వారు ఉత్సాహభరితంగా హార్దిక స్వాగతం పలకడం చూస్తే విడుదల వెనుక రాజకీయ చిత్రం గుడ్డివారికైనా స్పష్టంగా కనిపిస్తుంది. సంఫ్‌ు పరివార్‌ నైతికత ఏమిటో అర్థం అవుతుంది. ఈ కమిటీ ఎన్ని సార్లు సమావేశమైందో కమిటీ సభ్యులెవరూ చెప్పడం లేదు. తాము నిర్ణీత ప్రక్రి యను అనుసరించామని కమిటీ సభ్యుడైన రావుల్జీ చెప్పారు. రావుల్జీతో పాటు కమిటీలో ఉన్న మరో ఎమ్మెల్యే కూడా గోధ్రా జిల్లా కలోల్‌కు చెంది న వాడు కావడం గమనించదగింది. ఈ యాతన అనుభవించిన మహిళ ముస్లిం కాకుండా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఇంత ఘోరంగా ప్రవర్తించేది కాదు. 1992లో అమలులో ఉన్న నిబంధన ప్రకారం 11 మందిని విడుదల చేశారు. ఆ నిబంధన ఇప్పుడు లేదు అన్నది ఎవరికీ పట్టకపోవడం న్యాయమార్గ పాలన మంటగలిసిందనడానికి మరో ఉదాహరణ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img