ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి. రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;! ఎన్నికల ఉద్యోగస్తులు సమన్వయంతో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఆర్డిఓ రామభూపాలరెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మానాయక్, డిడిఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నవంబర్ 5న నిర్వహించే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కార్యక్రమంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 220 మంది ఎన్నికల ఉద్యోగులకు ఓట్లు వేసే విధానం, ముగింపు, సీజ్ చేయుట, సమన్వయంతో, బాధ్యతతో పని చేసే విధానాన్ని వారు వివరించారు. ఎన్నికల విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తప్పవు అని తెలిపారు. తెలియని విషయాలను ఎప్పటికప్పుడు తాము ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకోవాలని తెలిపారు. మొత్తం మండల పరిధిలో 45 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, 220 మంది ఎన్నికల విధులకు నియమించడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఆయా గ్రామ పంచాయతీలకు బస్సుల ద్వారా ఎన్నికల సామాగ్రి తో పాటు పిఓ లను, ఓపిఓ లను, ఇబ్బందిని పంపడం జరిగిందని తెలిపారు. అన్ని పోలింగ్ బూతుల వద్ద పోలీసుల ద్వారా భద్రత ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, ఎంపీడీవో వెంకటేశు, ఎమ్మార్వో దేవరాజ్, ట్రైనీ శిక్షకుడు వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఉద్యోగస్తులు సమన్వయంతో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించండి..
- Advertisement -
RELATED ARTICLES


