విశాలాంధ్ర – నూజివీడు టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సిడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నూజివీడు శ్రీసిద్ధార్థ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ యువకులకు మంగళవారం మినీ జాబ్ మేళా జరిగింది. మేళాలో మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూ నిర్వహించారు. మొత్తం 126 మంది అభ్యర్థులు మినీ జాబ్ మేళాకు హాజరుకాగా 43 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఈ తమ్మాజీరావు తెలిపారు. విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ ఇద్రిస్, జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్, ఎన్సిఎస్ యూనిట్ ప్రొఫెషనల్ ప్రవీణ్, ఏడిఎస్డిఈ కిషోర్, కోఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు.