Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

తెలుగుదేశం పార్టీకి అంబుళ్ళ మృతి తీరని లోటు

టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని

విశాలాంధ్ర – నిడమర్రు: (ఏలూరు జిల్లా)ఉంగుటూరు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, నిడమర్రు మండల మాజీ ప్రజాపరిషత్ అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, అంబళ్ళ వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి మృతి చెందడంతో ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి భౌతిక ఖాయానికి పూలమాల వేసి, తెలుగుదేశం జెండా పార్ధివదేహానికి కప్పి నివాళులర్పించిన ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆయన మాట్లాడుతూ అంబళ్ళ వెంకటేశ్వరావు మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సహృదయుడు, పోరాట యోధుడు. తెలుగుదేశంపార్టీ ఒక పోరాట యోదుడుని కోల్పోయిందని. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన అదికర ప్రభుత్వంపై పోరాడే తీరు నేటి తరానికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలటిడిపి పార్టీ అధ్యక్షుడు ముత్యాల స్వామి, మహమ్మద్ గఫర్ ఖాన్, ఆదిరెడ్డి చందర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img